కోల్డ్ స్టోరేజ్‌ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా
కొరిటెపాడు(గుంటూరు): ది గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్‌ల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పి.సురేంద్రబాబు, కార్యదర్శిగా కేఎస్ రాఘవయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో నూతన కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎస్వీ కోల్డ్‌స్టోరేజ్‌కి చెందిన పి.సురేంద్రబాబు, కార్యదర్శిగా శ్రీ మంజునాథ కోల్డ్ స్టోరేజ్‌కి చెందిన కేఎస్ రాఘవయ్యలతో పాటు కోశాధికారిగా ఆర్.వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా కె.అశోక్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా వి.వెలుగొండారెడ్డి, జుగిరాజ్ భండారి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, టి.గోపాలరావు, మానం శ్రీనివాసరెడ్డి, బి.పేరయ్య, ఎ.సుబ్బారావు, శ్రీపాల్ భండారిలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు సురేంద్ర బాబు, రాఘవయ్యలు మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న టీఎస్ ప్రకాశరావు కాలం చేసిన తర్వాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని వెల్లడించారు. రాబోయే రెండు సంవత్సరాలు కాలంలో అసోసియేషన్ కలిసికట్టుగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ తమ వద్ద పనిచేసే వందలాదిమంది కార్మికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
కోల్డ్ స్టోరేజ్‌ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా


