నేరెళ్లవాగుపై కుంగిన చప్టా
ఫిరంగిపురం: మండల కేంద్రం ఫిరంగిపురం నుంచి సత్తెనపల్లి దారిలో అల్లంవారిపాలెం దాటిన తరువాత నేరెళ్లవాగుపై దశాబ్దాల కిందట నిర్మించిన చప్టా శుక్రవారం ఉదయం కొంత భాగం కుంగిపోయింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రెండు నెలల కిందట చప్టా నెర్రెలిచ్చి ఉండటం గమనించి ‘ప్రమాదం మాటున ప్రయాణం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురించింది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఫిరంగిపురం నుంచి అల్లంవారిపాలెం, 113.తాళ్లూరు, శిరంగిపాలెం, తక్కెళ్లపాడు, కొమెరపూడి, కంటిపూడి గ్రామాల మీదుగా సత్తెనపల్లి దగ్గరి దారి కావడంతో ఎక్కువ మంది కార్లు, లారీలు, ద్విచక్ర వాహనదారులు ఈ మార్గం నుంచి ప్రయాణిస్తుంటారు. చప్టా కుంగిపోవడంతో పూర్తిగా కార్లు, బస్సులు, లారీలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
పట్టించుకోని అధికారులు
నిలిచిన వాహనాల రాకపోకలు


