విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు | - | Sakshi
Sakshi News home page

విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు

Dec 17 2025 7:01 AM | Updated on Dec 17 2025 7:01 AM

విజయక

విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు

విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ధనుర్మాస వేడుకలను మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనాలతో ధనుర్మాస వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం ఉదయం గోదా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, మంగళాశాసనం నిర్వహించారు. అనంతరం 1వ పాశుర విన్నపం, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదా అమ్మవారిని దర్శించుకున్నారు.

శ్రీ సాక్షి భావనారాయణ స్వామి ఆలయంలో...

పొన్నూరు: పట్టణంలోని స్వయంభూ శ్రీ సాక్షి భావనారాయణస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దేవాలయం అర్చకులు గోవర్ధనం రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగ్నిక స్వామి వేదాంతం అనంత శ్రీనివాస భట్టాచార్యులు, తిరుప్పావై ప్రవచకులు తిరువాయిపాటి గోవర్ధనాచార్యులు పాల్గొన్నారు. భక్తులు గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు.

వాజ్‌పేయి విగ్రహానికి

రూ.8 లక్షలు విరాళం

గుంటూరుమెడికల్‌: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గుంటూరులో సోమ వారం శంకుస్థాపన జరిగింది. గుంటూరు లక్ష్మీపురం నాలుగు రోడ్ల కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టకు గుంటూరుకు చెందిన పారిశ్రామికవేత్త మాదల రత్నగిరిబాబు రూ.8 లక్షలు విగ్రహ నిర్మాణ కమిటీకి మంగళవారం అందజేశారు.

వైభవంగా స్వామి వారి ఆరాధన మహోత్సవం

నగరంపాలెం(గుంటూరువెస్ట్‌):గుంటూరులోని శ్రీకంచి కామకోటి పీఠ శ్రీమారుతీ దేవాలయ ప్రాంగణంలో శ్రీకంచి కామ కోటి పీఠం 68వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి 32వ ఆరాధన మహోత్సవాన్ని మంగళవారం అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్‌ పర్యవేక్షించారు.

శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి విశేష పూజలు

తెనాలి: నాజరుపేటలోని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ పీఠపాలిత శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరిపారు. స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష అలంకరణ చేశారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. అప్పికట్ల వెంకటేశ్వరరావు సిద్ధాంతి ప్రవచనం చెప్పారు. 30న ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5.45 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తారు.

విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు 1
1/4

విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు

విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు 2
2/4

విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు

విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు 3
3/4

విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు

విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు 4
4/4

విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement