ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట
కొల్లిపర: మండల కేంద్రంలోని కృష్ణా నది కరకట్ట దిగువున అనుమతి లేకుండా బుధ వారం ట్రాక్టర్లులో ఇసుక లోడింగ్ చేస్తున్నవారిపై అధికారులు కన్నెర్ర చేశారు. రెవెన్యూ ఆర్‌ఐ వంశీకృష్ణ, మండల సర్వేయర్ హరికృష్ణ సంఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వారి వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు లేక పోవటంతో హెచ్చరించారు. ఈ సందర్భంగా తహసీల్దారు సిద్దార్ధ, ఎస్‌ఐ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్రీ ఇసుక విధానం ద్వారా ఇసుక తరలించే సమయంలో మండల పరిధిలోని వినియోగదారులు వారి వద్ద ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శిఽ అనుమతి పత్రం తీసుకుని స్ధానిక రెవిన్యూ శాఖకు అందిస్తే వాటిని పరిశీలించి అధికారులు ఇసుక తరలించడానికి అనుమతి పత్రం జారీ చేస్తారన్నారు.
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో బుధవారం మాతృమరణాలపై సమీక్ష జరిగింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ అధ్యక్షతన ఆయన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. జీజీహెచ్‌లో మరణాలపై ఆడిట్ నిర్వహించడం లేదంటూ నవంబరు 16న ‘అటకెక్కిన డెత్ ఆడిట్’ శీర్షిక పేరుతో ‘సాక్షి’ జిల్లా ఎడిషనల్ కథనం ప్రచురితమైంది. సాక్షి కథనానికి స్పందించిన ఆసుపత్రి అధికారులు బుధవారం సమీక్ష నిర్వహించారు. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులతో సమీక్ష చేశారు. గత రెండు నెలలుగా జీజీహెచ్‌లో ఆయా వార్డుల్లో చనిపోయిన రోగుల మరణాలపై సమీక్ష నిర్వహించారు. తురకపాలెం మెలియోడోసిస్, ఇటీవల కొత్తగా వస్తున్న స్క్రబ్‌టైఫస్ మరణాలపై ప్రత్యేక సమీక్ష చేశారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన వారి కేస్ షీట్‌లను 24 గంటల్లోగా మెడికల్ విభాగానికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మంగళవారం మరణాలపై సమీక్ష నిర్వహించారని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఉషారాణి, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ దేవకుమార్, న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బిందు నర్మద, ఎమర్జెన్సీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధికారాణి, పలువురు వైద్యులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట


