‘కోటి సంతకాల’ డిజిటలైజేషన్ ప్రారంభం
పొన్నూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. చంద్రబాబు పనితీరును వ్యతిరేకిస్తూ వైద్య, విద్యను కాపాడుకునేందుకు ప్రజలు సంతకాలు చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల నుంచి ఇప్పటివరకు సేకరించిన 65 వేల సంతకాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ సంతకాల ద్వారా తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారని తెలిపారు.
వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త
అంబటి మురళీ కృష్ణ


