న్యూస్‌రీల్
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
మార్మోగిన శివ నామస్మరణ
రెంటచింతల: సత్రశాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం బుధవారం పరమేశ్వరుని నామస్మరణతో మార్మోగింది. పక్కన ఉన్న పవిత్ర కృష్ణానది ఒడ్డున వేకువజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసి, కార్తిక దీపాలు వెలిగించారు.
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 78,360 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 51,182 క్యూసెక్కులు వదులుతున్నారు.
పునరావాస కేంద్రం సందర్శన
తెనాలిటౌన్: రూరల్ మండలం కొలకలూరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బుధవారం తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనాసింహ సందర్శించారు.
కన్నీరు మిగిల్చిన మోంథా
పంటలు మునిగి తీరని నష్టం
పాములపాడు గ్రామంలో కొండవీటి వాగు వరద ఉద్ధృతి పోటెత్తడంతో అన్ని రకాల పంటలు పూర్తిగా నీటమునిగాయి. రైతులకు తీరని నష్టం ఏర్పడింది. 4 అడుగుల మేర నీటి ప్రవాహం ఇంకా పారుతూనే ఉంది. అధికారులు పంటనష్టం అంచనా వేసి తగిన న్యాయం చేయాలి.
– పరుచూరి నారాయణ, రైతు, పాములుపాడు
రైతన్నల ఆశలపై మోంథా తుపాను నీళ్లు జల్లింది. ఇప్పటికే రెండుసార్లు భారీ
వర్షాలకు దెబ్బతిని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న రైతులను.. ఇక కోలుకోలేని విధంగా తుపాను నష్టపరిచింది. జిల్లాలో 1.09 లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తిన్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
7
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


