పునరావాస కేంద్రంలో పనిచేయని ఫ్యాన్లు
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఫ్యాన్లు మొరాయించాయి. మోంథా తుపాను నేపథ్యంలో స్థానిక వైఎస్సార్ కాలనీకి చెందిన సుమారు 130 మందిని పునరావాస కేంద్రానికి తరలించి మూడు గదులు కేటాయించారు. సోమవారం సాయంత్రం జేసి అశుతోష్ శ్రీవాస్తవ సందర్శించిన సమయంలో కచ్చితంగా పునరావాస కేంద్రంలో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓ గదిలో ఫ్యాన్లు పనిచేయక పోవడంతో రాత్రంతా దోమలతో సహవాసం చేస్తూ నిర్వాసితులు నిద్రించారు. చిన్నారులు కూడా ఉండటంతో తల్లిదండ్రులకు దోమల గోల తప్పలేదు.


