మానవతా దృక్పథంతో న్యాయం చేయాలి
● వైఎస్సార్ సీపీ తాడికొండ సమన్వకర్త వనమా బాల వజ్రబాబు
●వృద్ధురాలు, మానసిక వికలాంగురాలికి పరామర్శ
తాడికొండ: రాజధానిలో కారుణ్య మరణం కోరుకున్న వృద్ధురాలు, మానసిక వికలాంగురాలి విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు(డైమండ్) కోరారు. సోమవారం రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం రాయపూడిలో సీఆర్డీఏ అధికారుల ఒత్తిడికి గురై కారుణ్య మరణం కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన నెల్లూరు శేషగిరమ్మ, మనుమరాలు శ్యామల కుటుంబాన్ని పరామర్శించారు. విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, మీ కుటుంబానికి న్యాయం జరిగేే వరకు పోరాటం చేస్తానని భరోసా కల్పించారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు మైనేని నాగమల్లేశ్వరరావు, నాయకులు చుండు వెంకటరెడ్డి, ఆరేపల్లి జోజి, కొప్పుల శేషగిరిరావు, బెజ్జం రాంబాబు, షేక్ జానీ బాషా ఉన్నారు.


