త్రుటిలో తప్పిన ప్రమాదం
గుంటూరు రూరల్: ఎదురుగా వెళుతున్న రెండు వాహనాలను క్రాస్ చేస్తూ లారీని కారు ఢీకొన్న ఘటన ఆదివారం హౌసింగ్‌బోర్డ్ కాలనీ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గుంటూరుకు చెందిన ఓ కుటుంబం శుభకార్యానికి నరసరావుపేట వెళ్లి తిరిగి గుంటూరు వస్తున్నారు. అదే సమంలో హౌసింగ్‌బోర్డ్ కాలనీ సమీపంలో కారు డ్రైవర్ ఎదురుగా వెళుతున్న లారీని, పక్కనే వెళుతున్న ఆటోను క్రాస్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో కారు పల్టీ కొట్టింది. కారులో నలుగురు వ్యక్తులు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నా ఎటువంటి గాయాలు కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని కారులో ఇరుక్కున్న వారిని డోర్లు లాగి బయటకు సురక్షితంగా తీశారు. లారీ, కారు యజమానులు ఇరువురు నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం


