హోరాహోరీగా బాస్కెట్ బాల్ పోటీలు
గుంటూరు రూరల్: మండలంలోని పొత్తూరులోని ఏసీఎంఈ స్కూల్‌లో శనివారం ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. పోటీలను స్కూల్ డైరెక్టర్ నందమూరి సౌగంద్‌కృష్ణ క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటుగా క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక అభివృద్ధిని కలుగజేస్తాయన్నారు. హోరాహోరీగా జరిగిన పోటీలలో నగరంలోని ఐదు ఇంటర్‌నేషనల్ స్కూల్ విద్యార్థులు పాల్గొనగా పోటీలలో బాలికల విభాగంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పథమ స్థానం సాధించగా, ద్వితీయ స్థానంలో ఏసీఎంఈ స్కూల్, తృతీయ స్థానంలో నెక్ట్స్‌జెన్ ఇంటర్‌నేషనల్ స్కూల్ గెలుపొందారు. బాలుర విభాగంలో ఆక్స్‌ఫర్డ్ స్కూల్ ప్రథమ స్థానం సాధించగా, ఏసీఎంఈ స్కూల్ ద్వితీయ స్థానం, తృతీయ స్థానంలో నెక్ట్స్ జెన్ ఇంటర్‌నేషనల్ స్కూల్ నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.దీప్తి పాల్గొన్నారు.


