మెదడువాపుతో బాలిక మృతిపై ఆరా
పెదకూరపాడు : పెదకూరపాడులోని అంబేద్కర్ కాలనీలో మెదడువాపు వ్యాధితో మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని జిల్లా ఇమినేషన్ అధికారి డాక్టర్ రాంబాబు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రవీంద్రరత్నాకర్, 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పరిమళ సందర్శించారు. మృతి చెందిన బాలిక కుటుంబంలో వివరాలు ఉన్నాయా, చుట్టుపక్కల ఏమైనా జ్వరాలు ఉన్నాయా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. చిన్నారులకు అందుతున్న ఇమినేషన్ ఇంజక్షన్ల గురించి ఆరా తీశారు. అనంతరం 75 తాళ్లూరు ప్రాథమిక వైద్యశాలను సందర్శించి రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. అధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులతో పాటు మలేరియా జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బందికి సూచనలు అందించారు.


