
ఏఎన్‌యూలో ఘనంగా ఇంజినీర్స్ డే
పెదకాకాని(ఏఎన్‌యూ): భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తిని విద్యార్థు లు ఆదర్శంగా తీసుకోవాలని ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ వైఆర్ హరగోపాల్‌రెడ్డి సెమినార్ హాల్‌లో సోమవారం సివిల్ విభాగం ఆధ్వర్యాన ఇంజినీర్స్‌డే–2025 కార్యక్రమం ఘనంగాజరిగింది. ముఖ్య అతిథిగా వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు విచ్చేసి మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు తమ లక్ష్యాలు నిర్దేశించుకోవా లని తెలిపారు. విశిష్ట అతిథి రిటైర్డ్ చీఫ్ ఇంజి నీర్ జి.బ్రహ్మయ్య మాట్లాడుతూ సివిల్ ఇంజి నీరింగ్‌లోని స్టేట్, సెంట్రల్ ప్రైవేట్ ఉద్యోగావకాశాల గురించి వివరించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యచిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, సివిల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు.
పీజీ రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల
పెదకాకాని(ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జూలైలో జరిగిన పీజీ కోర్సుల రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌లో 45 మందికి 44 మంది, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీలో 24 మందికి 17మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యూయేషన్‌కు ఈనెల 24వ తేదీలోగా ఒక్కో పేవరుకు రూ.1860, పర్సనల్ వెరిఫికేషన్‌కు రూ.2190 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఎయిడ్స్ నియంత్రణ ప్రచార రథం ప్రారంభం
గుంటూరుమెడికల్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ ప్రచార రథాన్ని సోమవారం గుంటూరు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ 15 రోజులపాటు జిల్లాలో ఈ ప్రచార రథం పర్యటిస్తుందన్నారు. ప్రజా సమూహాలు, మురికివాడలలో పర్యటిస్తూ ప్రజలకు హెచ్‌ఐవి/ఎయిడ్స్, సుఖ వ్యాధులపై అవగాహన కల్పిస్తారన్నారు. మరింత సమాచారం కోసం 1097 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ విభాగం మేనేజర్ డాక్టర్ శాంసన్ పాల్గొన్నారు.
మానవత్వం చూపిన పోలీసులు
మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలోని హుస్సేన్ కట్ట వద్ద గత నాలుగు రోజులుగా మతిస్థిమితం లేని ఓ మహిళ తిరుగుతోంది. ఇది గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రవీంద్రనాయక్ తక్షణమే స్పందించి సోమవారం ఉదయం ఆ మహిళను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ గిరిపురం అని తప్ప ఆమె ఇంకేమీ వివరాలు వెల్లడించలేక పోతోందని, ఆమె చెప్పిన ప్రాంతానికి పోలీస్ సిబ్బందిని పంపించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
శ్రీవైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు
తెనాలి: పట్టణంలోని శ్రీ శరణాగతి గోష్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి మంగళశాసనా లతో సోమవారం స్థానిక నాజరుపేటలోని లక్ష్మీనగర్‌లో శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకుడు నరేంద్ర రామానుజదాసస్వామి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు వేడుకలను ఆరంభించారు. 64 ప్రసాదాల నివేదన, తీర్థ ప్రసాదాల వితరణతో కార్యక్రమం ముగిసింది. నరేంద్ర రామానుజ దాసస్వామి కృష్ణాష్టమి, విశిష్టతను ప్రవచించారు. ఎం.రమణయ్య, చందు రామారావు, టి. సీతారామయ్య పాల్గొన్నారు.

ఏఎన్‌యూలో ఘనంగా ఇంజినీర్స్ డే