
అర్జీల పరిష్కారంలో సమన్వయం అవసరం
యానాదులకు స్థిర నివాసం కల్పించండి
అధ్వానంగా రోడ్డు, డ్రెయిన్‌లు
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారంలో వివిద శాఖల మద్య సమన్వయం అవసరమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో అందిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ప్రజలల్లో సంతృప్తి స్థాయిని పెంచేలా అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం వచ్చిన 221 అర్జీలను జేసీ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, డీఆర్‌ఓ షేఖ్ ఖాజావలి, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, డీఎస్‌ఓ కె.శ్రీనివాసరావు, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయిలతో కలసి స్వీకరించారు.
గుంటూరులోని 51వ వార్డులోని కాకుమానువారితోటలోని కార్మిక శాఖ స్థలంలో 20 ఏళ్ల నుంచి 22 యానాది కుటుంబాలు నివాసముంటున్నాయి. మౌలిక సదుపాయాలు లేవు. వర్షాల కారణంగా కాలనీ మొత్తం మునిగిపోతుంది. వారికి స్థిర నివాసం ఏర్పాటు చేయండి.
–బాధితులు, బహుజన మహాసభ నాయకులు, గుంటూరు.
గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. తవ్వేసిన రోడ్డు, కాలువలు సకాలంలో పూర్తి చేయరు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ఏటీ అగ్రహారంలో రోడ్లు, డ్రెయిన్లు పూర్తిస్థాయిలో ఎప్పుడు బాగు చేస్తారు. బ్రాడీపేట, కోబాల్ట్‌పేట ప్రాంతాల్లోనూ డ్రెయిన్‌లు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పట్టించుకోండి.
–సునీల్, గుంటూరు.

అర్జీల పరిష్కారంలో సమన్వయం అవసరం