
ఆధారం లేకుండా పోయింది...
చిన్నప్పుడే అమ్మ, నాన్నలు చనిపోతే నాన్నమ్మ అంకమ్మ వద్ద పెరిగాను. నాకు ఇద్దరు అన్నదమ్ములున్నారు. అందులో కుటుంబానికి సంపాదించి పెట్టే పెద్దన్న పెదమూర్తి మరణించాడు. దీంతో మాకు రోజు గడవడమే కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకుని నాకు ఉద్యోగంతోపాటు నష్టపరిహారం చెల్లించాలి.
– ఎం.తిరుపతమ్మ, తురకపాలెం.
గతేడాది ఆగస్ట్ నెలలోనే మా ఊళ్లో నీరు తాగడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. దీంతో మా ఊళ్లో కొందరు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాం. అప్పుడు ఎవ్వరూ స్పందించలేదు. మా కుటుంబానికి అండగా ఉండే నా భర్త దీనరాజ్ కల్తీ నీటికి బలి అయ్యారు.
–కె.భాగ్యరాణి, తురకపాలెం.
ఒకరి తర్వాత ఒకరు వచ్చి పోతున్నారు. పట్టించుకునే నాథుడే లేడు. పేదల కోసం కష్టపడుతున్నామంటున్న ఈ ప్రభుత్వ పెద్దలు ఆ పేదలే అకాల మరణాలకు గురైతే ఎందుకు పట్టించుకోవడం లేదు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు. కల్తీ నీటి కారణంగా నా భర్త ఇజ్రాయెల్ మరణించారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఆధారం లేకుండా పోయింది.
– సంగా మరియమ్మ, తురకపాలెం
మూడు నెలల కాలంలో 30 మంది మరణిస్తే ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది. ఇంకా ఎంతకాలం గడిపేస్తారు. ఇంకా ఎంత మంది ప్రాణాలు పోతే స్పందిస్తారు. నా భర్త లక్ష్మయ్యను పోగొట్టుకున్నాను. పేదల కష్టాలు పట్టించుకోకుండా పెద్ద పెద్ద భవనాలు కట్టి ఇదే అభివృద్ధి అంటే ఎలా.
– డి.లక్ష్మి, తురకపాలెం.

ఆధారం లేకుండా పోయింది...

ఆధారం లేకుండా పోయింది...

ఆధారం లేకుండా పోయింది...