
బాధితులకు అండగా ఉంటాం !
ఏఎస్పీ జీవీ రమణమూర్తి
నగరంపాలెం: నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ జీవీ రమణమూర్తి (పరిపాలన) బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల బాధలను అలకించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఫిర్యాదులకు సంబంధించి పోలీస్ అధికారులతో మొబైల్ ఫోన్‌లో మాట్లాడారు. నిర్ణీత వేళల్లో చట్ట పరిధిలో అర్జీలు పరిష్కరించాలని జిల్లా ఏఎస్పీ ఆదేశించారు. డీఎస్పీలు భానోదయ (గుంటూరు దక్షిణ), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్) అర్జీలు స్వీకరించారు.