
జాతీయ లోక్‌అదాలత్‌పై సమావేశం
గుంటూరు లీగల్: ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధానన్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు అన్ని ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, చిట్ ఫండ్ కంపెనీల ప్రతినిధులతో ఒకటవ అదనపు జిల్లా కోర్టులో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాల్గో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ బాబు, ఒకటో అదనపు జిల్లా జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి, మూడో అదనపు జిల్లా జడ్జి సి.హెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు, రెండో అదనపు జిల్లా జడ్జి వై.నాగరాజ పాల్గొని అన్ని ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులు, చిట్‌ఫండ్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. సివిల్, క్రిమినల్ కేసులు ఎక్కువ సంఖ్యలో రాజీ చేసుకోవడానికి తగు సలహాలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా గోకుల్ చిట్ ఫండ్ కంపెనీ చెక్ అమౌంట్‌లో పది శాతం తగ్గించుకొని కేసును పరిష్కరించుకొనేందుకు అంగీకరించారు. ఇది కక్షిదారులకు మంచి అవకాశమని గోకుల్ చిట్ ఫండ్ వారితో కక్షిదారులు సంప్రదించి వారి కేసులను సత్వరమే రాజీ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారానికి తగు సలహాలు ఇచ్చి, సూచనలు చేశారు.