
కామన్ ఫెసిలిటీ సెంటర్‌కు స్థల పరిశీలన
మోతడక (తాడికొండ): నేషనల్ లైవ్‌లీ హుడ్ మిషన్ నేతృత్వంలో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ఢిల్లీకి చెందిన కేంద్ర బృందం సభ్యులు తాడికొండ మండలం మోతడక గ్రామంలో బుధవారం పర్యటించారు. మహిళా సంఘాలు తయారు చేస్తున్న పచ్చళ్లు, కారంపొడులు తదితర యూనిట్లను పరిశీలించారు. అనంతరం బండారుపల్లి, నిడుముక్కల గ్రామాలలో పర్యటించారు. ఎంఎస్‌ఎంఈ కింద ఎన్‌ఆర్‌ఎల్‌ఎం నిధులతో పికిల్ హబ్ ఏర్పాటుకు గ్రామంలో 4 ఎకరాల్లో ప్లాటెడ్ ఫ్యాక్టరీతోపాటు కామన్ ఫెసిలిటీ హబ్‌ను రూ.20 కోట్లతో ఏర్పాటు చేసే దిశగా స్థల పరిశీలన చేసినట్లు ఏపీఎం సాంబశివరావు తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ బృందం సభ్యులు అరవింద్ పటేద్, జనార్దన్, హైదరాబాద్‌కు చెందిన నేషనల్ లైవ్‌లీ హుడ్ సభ్యులు గోపాలకృష్ణ, డైరెక్టర్లు, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీ విజయలక్ష్మి, ఏపీడీలు కిరణ్ కుమార్, డీపీఎం అశోక్ కుమార్, తహసీల్దార్ మెహర్ కుమార్, ఏపీఎం సాంబశివరావు, సీసీలు సిబ్బంది పాల్గొన్నారు.