
దాడికి యత్నం
గత నలభై ఏళ్లుగా కాకానితోట వద్ద ఉంటున్నాం. చిక్కు వెంట్రుకల వ్యాపారం చేస్తుంటాం. స్థానికంగా ఉండే నాలుగు కుటుంబాల సభ్యులు పెద్దలుగా చలామణి చేస్తున్నారు. ఏ చిన్న వివాదం జరిగినా వారి సమక్షంలో రాజీ చేసుకోవాలి. పోలీసుల వద్దకెళ్తే జరిమానాలు విధించడం, కుల బహిష్కరణకు పాల్పడుతున్నారు. ఐదేళ్ల కిందట మమ్ములను ఆరు నెలలు కులం నుంచి బహిష్కరించారు. మళ్లీ వచ్చేందుకు రూ.3 లక్షల జరిమానా చెల్లించాం. ప్రస్తుత రోజుల్లోనూ మూఢ నమ్మకాలు ఏంటని ప్రశ్నించినందుకు నా కుమారులతో అమర్యాదగా మాట్లాడారు. ఈనెల 13 రాత్రి కుటుంబంపై దాడికి యత్నించారు. కులం నుంచి బహిష్కరిస్తున్నామని, లక్ష రూపాయాలు జరిమానా చెల్లించాలని బెదిరించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తే అక్కడా కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. వారి ముందు చెప్పు లేసుకుని తిరిగినా సహించరు. తమకు న్యాయం చేయగలరు.
– శ్రీపాటి ఆదెమ్మ, కుమారులు నాగరాజు, రమేష్, వెనిగండ్ల, పెదకాకాని