
మనోళ్లే.. వదిలేయ్ !
తాజాగా ఆదివారం ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడులోని ఒక మిల్లులో 800 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గత ఏడాది కూడా ఇదే మిల్లుపై స్వయంగా పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ దాడిచేసి పెద్దఎత్తున బియ్యం పట్టుకున్నారు. అయినా ఆ మిల్లులో రేషన్ దందా కొనసాగుతూనే ఉంది. సుమారు ఇరవై రోజుల కిందట ప్రత్తిపాడులో సుమారు వందకు పైగా రేషన్ బస్తాల లోడుతో వెళుతున్న ఒక పెద్ద ఆటోను స్థానికులు ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. అక్కడకు వచ్చిన పోలీసులు వాహనాన్ని స్టేషన్‌కు తరలించే లోపే స్థానిక ఎమ్మెల్యేకు దగ్గరగా ఉండే ఒక నాయకుడు పోలీసులకు ఫోన్ చెయ్యడంతో వాహనాన్ని పోలీసులు స్టేషన్‌కు తరలించకుండానే వదిలేశారు. తర్వాత విషయం సోషల్ మీడియాలో రావడంతో అర్ధరాత్రి దాటిన తరువాత వాహనాన్ని స్టేషన్ వద్దకు రప్పించారు. అయితే అప్పటికే వాహనంలో ఉన్న బియ్యం బస్తాలు ముప్పావు వంతు మాయమయ్యాయి.