
జీజీహెచ్ సీఎస్ ఆర్‌ఎంఓగా బాధ్యతల స్వీకరణ
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓగా డాక్టర్ బుజ్జ వెంకటేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఆయన ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1982లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1992లో పీజీ వైద్యవిద్యను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నిమ్స్ మెడికల్ కాలేజీలో చదివారు. 1997లో శంషాబాద్ సివిల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా ప్రభుత్వ సర్వీస్‌లోకి వచ్చారు. 2006 –10 వరకు గాంధీ అసుపత్రిలో పనిచేస్తూ బదిలీపై ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో స్టాటిటిక్ ప్లానింగ్ విభాగంలో పనిచేశారు. 2012లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పదోన్నతి పొంది రాష్ట్‌ట్ర వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా 2022 వరకు విధులు నిర్వర్తించారు. తర్వాత నుంచి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో సివిల్ సర్జన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పని చేస్తూ బదిలీపై గుంటూరుకు వచ్చారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆయనకు పలువురు వైద్యులు అభినందించారు.