నరనారాన నయవంచన | - | Sakshi
Sakshi News home page

నరనారాన నయవంచన

Jun 4 2025 1:19 AM | Updated on Jun 4 2025 1:19 AM

నరనార

నరనారాన నయవంచన

కూటమి ఏడాది పాలనలో అడుగడుగునా దగా, దౌర్జన్యం

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ప్రచారంతో అందరూ నిజమే అనుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన ఉగాది పోయింది... దసరా పోయింది. ప్రయాణానికి పంక్చర్‌ పడుతూనే ఉంది. అమలైతే జిల్లాలో రోజుకు రూ.30 లక్షల చొప్పున ఏడాదికి రూ.109 కోట్ల మేరకు మహిళలకు లబ్ధి కలుగుతుంది. ఈ ఉచితం ఇవ్వకపోవడం వల్ల ఈ మేర జిల్లాకు చెందిన మహిళలు నష్టపోయారు.

మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పథకం అంతా ‘గ్యాస్‌’ అని తేలిపోయింది. చాలా మందికి తొలి విడత సబ్సిడీనే పడలేదు. రాయితీ డబ్బులు ముందుగానే ఖాతాలకు జమ చేస్తామని డప్పులు కొడుతున్నారు. జిల్లాలో 56 ఏజెన్సీల పరిధిలో 7,55,000 కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి 187.43 కోట్ల వరకు లబ్ధిదారులకు అందాలి. కానీ అమలు నామమాత్రంగానే ఉంది.

సాక్షి ప్రతినిధి, గుంటూరు, ప్రత్తిపాడు: కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కటంటే ఒక్కటీ ఏడాది గడిచినా అమలు కాలేదు. తల్లికి వందనం కింద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ. 15,000 ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ప్రతీ ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు అందిస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ. 3000 భృతి అందజేస్తామన్నారు. ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తెస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు నెలకు రూ. 1500 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని పేర్కొన్నారు. అన్నదాతకు ఏడాదికి రూ. 20 వేలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ జూన్‌ నుంచే అమలు చేస్తామన్నారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ’ అంటూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ‘‘మనం హామీలిచ్చాం. సూపర్‌ సిక్స్‌ చెప్పాం. చూస్తే భయమేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి’’ అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు.

ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. 19 – 59 ఏళ్ల వారికని చెప్పినా అతీగతీ లేదు. ఈ పథకం కింద జిల్లాలో 7,28,391 మందికి అర్హత ఉన్నట్లు అంచనా. ఇప్పటికే అక్షరాలా రూ.1311.10 కోట్లు వీరికి అందాలి. ఇంతవరకు ఒక్కపైసా ఇవ్వలేదు.

అతివలకు ఉచిత బస్‌.. తుస్‌

ఉచిత సిలిండర్ల అమలు ‘గ్యాసే’

ఎన్నికల హామీలు

మహిళలకు సాయం హుళక్కే

నరనారాన నయవంచన 1
1/4

నరనారాన నయవంచన

నరనారాన నయవంచన 2
2/4

నరనారాన నయవంచన

నరనారాన నయవంచన 3
3/4

నరనారాన నయవంచన

నరనారాన నయవంచన 4
4/4

నరనారాన నయవంచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement