
బాలికల వసతి భవనానికి శంకుస్థాపన
వినుకొండ: పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ స్థలంలో రూ. 2.50 కోట్లతో చేపట్టబోయే కస్తూర్బాగాంధీ బాలికల వసతి భవనం నిర్మాణానికి నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాలికల విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. చీఫ్ విప్ జీవీ మాట్లాడుతూ బాలికల విద్యకు ప్రభుత్వ అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ీపీఏనంటూ ఫోన్.. వ్యక్తిపై కేసు
లక్ష్మీపురం: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పీఏని అంటూ నగరపాలక సంస్థ కమిషనర్‌కు, పలు విభాగాల అధికారులకు ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్న ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పీఏ పంగులూరి పుల్లయ్య నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశారు. గుంటూరులోని సాయినగర్‌లో నగరపాలక సంస్థ అధికారులు సక్రమంగా పని చేయడం లేదని, వీధి లైట్లు వెలగడం లేదని, శానిటరీ వర్కర్లు రావడం లేదని ఆ వ్యక్తి ఫోన్ చేసి పేర్కొంటున్నాడు. మాచర్ల ఎమ్మెల్యే పీఏ పుల్లయ్య నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.