సామాజిక సమస్యలను స్పృశించిన నాటికలు | - | Sakshi
Sakshi News home page

సామాజిక సమస్యలను స్పృశించిన నాటికలు

May 5 2025 8:50 AM | Updated on May 5 2025 10:30 AM

సామాజ

సామాజిక సమస్యలను స్పృశించిన నాటికలు

తెనాలి: రూరల్‌ మండల గ్రామం కొలకలూరులో కొలంకపురి నాటక కళాపరిషత్‌, శ్రీసాయి ఆర్ట్స్‌, కొలకలూరు సంయుక్త నిర్వహణలో జరుగుతున్న ఉభయ రాష్ట్రస్థాయి 11వ ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం ముగిశాయి. చివరిరోజున డాక్టర్‌ రమణ యశస్వి, డాక్టర్‌ కొచ్చెర్లకోట జగదీష్‌ జ్యోతిప్రజ్వలనతో ప్రదర్శలనలను ఆరంభించారు. తొలుత చైతన్య కళాస్రవంతి, ఉక్కునగరం, విశాఖపట్నం వారి ‘అ సత్యం’ నాటికను ప్రదర్శించారు. మనిషి సత్యం చెప్పినా అబద్ధం ఆడినా దానివెనుక ఏదొక భయమో? స్వార్థమో ఉంటుంది. దానివల్ల అతడికి మేలు జరగొచ్చు లేదా కీడు కలగొచ్చు. నిజానికి యదార్థమైనా ఒక చెడుకు దోహదపడితే అది అసత్యం...అబద్ధమైనా ఒక మంచికి తోడ్పడితే అది సత్యం...అనేదే నాటిక సారాంశం. సుధ మోదుగు కథను పిన్నమనేని మృత్యుంజయరావు నాటకీకరించారు. పి.బాలాజీనాయక్‌ దర్శకత్వంలో ప్రదర్శించారు. దర్శకుడు బాలాజీనాయక్‌తోపాటు పి.రామారావు, వై.అనిల్‌కుమార్‌, ఎం.వాసు, థౠమస్‌, ఎస్‌.మాధవి నటించారు. తదుపరి లలిత శ్రీ కళాసమితి, శ్రీకాకుళం వారి ‘మతమా...మానవత్వమా?’ నాటికను ప్రదర్శించారు. మతం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదనీ, మానవత్వమే శాశ్వతమని. మనిషికి మానవత్వమే ప్రధానమని, అదే నిలిచి వెలుగుతుందని సందేశాన్నిచ్చిందీ నాటిక. కంచర్ల సూర్యప్రకాశరావు రచనను ఎల్‌.రామలింగస్వామి దర్శకత్వంలో ప్రదర్శించారు. ప్రధాన పాత్రల్లో బోసుబాబు, కేతిరెడ్డి రాజేశ్వరి, గుత్తు రవిబాబు, ప్రసాదవవు, లక్ష్మణరావు, కామేశ్వరరావు నటించారు. చివరగా శ్రీసాయి ఆర్ట్స్‌, కొలకలూరు వారి ‘జనరల్‌ బోగీలు’ నాటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

సురభి ప్రభావతికి జీవితసాఫల్య పురస్కారం

ఇదే వేదికపై యడ్లపాడు ‘వేదిక’ పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు అధ్యక్షతన గోపరాజు బాలాత్రిపుర సుందరమ్మ జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటి సురభి ప్రభావతికి ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ చేతులమీదుగా ప్రదానం చేశారు. ప్రముఖ రూపశిల్పి ఎం.మదన్‌మోహన్‌ స్మారకంగా పసుమర్రుకు చెందిన రంగస్థల రూపశిల్పి పచ్చల శేషగిరిని సత్కరించారు. వివిధ కళాపరిషత్‌ల బాధ్యులు నూతలపాటి సాంబయ్య, వల్లూరు శివప్రసాద్‌, చాగంటి నాగేశ్వరరావు, కల్వకొలను అనంత్‌, గోగిశెట్టి వర్మ మాట్లాడారు. నిర్వాహక సంస్థల బాధ్యులు గోపరాజు రమణ, గోపరాజు విజయ్‌, సుద్దపల్లి మురళీధర్‌, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

సామాజిక సమస్యలను స్పృశించిన నాటికలు 1
1/1

సామాజిక సమస్యలను స్పృశించిన నాటికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement