
శాంతి భద్రతల పర్యవేక్షణలో సాంకేతికతకు ప్రాధాన్యం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): శాంతి భద్రతల పర్యవేక్షణలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ సతీష్‌కుమార్ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో బుధవారం సాంకేతిక పరిజ్ఞానంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసింగ్‌లోనూ సాంకేతిక పరిజ్ఙానంతో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జరిగే నేర సమగ్ర సమాచారాన్ని రూపొందించాలని చెప్పారు. నేర స్థలాలను అనుసంధానం చేసి, నేరస్తులను, నేరాలకు కారణాలను గుర్తించాలని సూచించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, నేరస్తులు మళ్లీ నేరాలకు పాల్పడకుండా చేయాలన్నారు. ఇటీవల వేలిముద్రలకు సంబంధించి ఏఎఫ్‌ఐఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కువ కేసులు ఛేదించామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), సుప్రజ (క్రైం), డీఎస్పీలు శివాజీరాజు (సీసీఎస్), రమేష్ (ట్రాఫిక్), సుబ్బారావు (మహిళా పీఎస్) పలు విభాగాల సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎస్పీ సతీష్‌కుమార్