ఆదివారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2025
చేప పిల్లలు విడుదల
విజయపురిసౌత్: అనుపు వద్ద కృష్ణా జలాశయంలోకి మత్స్యశాఖ అధికారులు 10 లక్షల చేప పిల్లలను శనివారం విడుదల చేశారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 519.70 అడుగుల వద్ద ఉంది. కుడికాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది.
నృసింహుని సేవలో..
మంగళగిరి టౌన్: మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు మోహనకృష్ణ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుంటూరు జిల్లాతో పాటు నగరంలోని పలు పెట్రోలు బంకుల నిర్వాహకులు నిబంధనలకు పెట్రోలు వదులుతున్నారు. కొలతల్లో వ్యత్యాసం.. నాణ్యత ఘోరం.. వసతులు మృగ్యం. ఇదీ ఆయా చోట్ల దుస్థితి. ఇంత జరుగుతున్నా అధికారుల తనిఖీలు, తీసుకున్న చర్యలు శూన్యం. బండికి కాస్త గాలి పెట్టండి అని వేడుకున్నా.. సిబ్బంది లేరంటూ, మిషన్ పనిచేయదంటూ.. వస్తే మీరే పెట్టుకోండంటూ సిబ్బంది విరుపైన సమాధానం.. ఇంధన పరిమాణం తగ్గిందేందని ప్రశ్నిస్తే ఎండకు ఆవిరి అవుతుందంటూ వింతైన జవాబు.. లీటరుకు ఎందుకు అ‘ధనం’గా తీసుకుంటున్నారని అడిగితే మా దగ్గర ఇంతే అంటు కటువైన సమాధానం.. చిప్ మోసాలపై ఆరా తీయబోగా అంతా గప్‘చిప్’గా సర్దుకోవడం. ‘సాక్షి’ బృందం జిల్లాలోని పలు పెట్రోలు బంకుల్లో పరిశీలన జరపగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
ఇఫ్తార్ సహర్
(ఆది) (సోమ)
గుంటూరు 6.24 4.53
నరసరావుపేట 6.26 4.55
బాపట్ల 6.24 4.53
నెహ్రూనగర్/ పట్నంబజారు/ గుంటూరు వెస్ట్: నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు...కొలతల్లోనూ తేడా చూపిస్తున్నారు...రికార్డుల నిర్వహణ కూడా అంతంతమాత్రమే.. జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో తీరిది. పెట్రోల్ అమ్మకాల్లో పూర్తిస్థాయిలో గోల్‌మాల్ జరుగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులు గగ్గోలు పెడుతున్నా...అధికారుల తనిఖీలు కూడా తూతూ మంత్రంగానే జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంతా గప్‘చిప్’!
జిల్లాలో దాదాపు ప్రతి బంకు వద్ద పెట్రోలు లీటర్‌కి 5 ఎంఎల్ నుంచి 30 ఎంఎల్ దాకా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందని బంకుల నిర్వాహకులను అడగ్గా వేసవి ఎండల వలన ఆవిరి అయిపోతుందని పేర్కొంటున్నారు. దీంతో పాటు అమౌంట్ ఫీడ్ చేసే కీబోర్డ్ వెనకాల చిన్న చిప్ ఉంటుందని...దీని ద్వారా పెట్రోల్ గన్‌లో మోసం జరిగే అవకాశం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిప్‌ను మేనేజ్ చేసేందుకు రిమోట్ సిస్టం వచ్చిందని.. దాని ద్వారా ఎవరైనా అధికారులు తనిఖీకి వస్తే చిప్‌ను ఆఫ్ చేస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పెట్రోల్ బంకుల్లో 4 గన్‌లు ఉంటే ఒక గన్ మాత్రమే కరెక్ట్‌గా పనిచేస్తుందని.. మిగిలిన మూడు గన్‌లు సరిగా పనిచేయవని వీటి ద్వారా వినియోగదారులను దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో పెట్రోల్‌కి రూ 3.74 పైసలు, డీజీల్‌కి రూ.2.20పైసలు బంకుల నిర్వాహకులకు కమీషన్ వస్తుంది. కల్తీ విషయానికొస్తే కేంద్ర ప్రభుత్వ నూతన విధాల కారణంగా కొంత తగ్గిందనే చెప్పాలి. అన్ని బంకుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి.
తనిఖీలు నామమాత్రం..
జిల్లాలో మొత్తం 189 పెట్రోలు బంకులు ఉండగా, గుంటూరు నగరంలో సుమారు 30 పైగా ఉన్నాయి. అయితే వీటిల్లో పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు కావడం లేదు. పెట్రోల్ బంకులను నిరంతరం సివిల్ సప్లయీస్‌తో పాటు తూనికలు కొలతల శాఖ, ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు తనిఖీలు చేస్తుంటారు. బంకుల్లో కొలత తేడా వచ్చిందని భావిస్తే అక్కడ చెకింగ్ చేయమని అడగొచ్చు. తూనికలు, కొలతల శాఖ సర్టిఫై చేసిన 5 లీటర్ల క్యాన్‌తో కొలిచి చూపాల్సిన బాధ్యత బంక్ యజమానులపై ఉంది. క్వాలిటీలో తేడా అని భావిస్తే అక్కడే ఫిల్టర్ పేపర్‌పై పెట్రోల్ పోసి తనిఖీ చేసి చూపుతారు. అయితే అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటంతో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. కేసుల నమోదులో కూడా అంతంతమాత్రంగానే వ్యవహరిస్తూ...స్వలాభం కోసం అధికారులు వెంపర్లాడుతున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు. పలు ఫిర్యాదులు మౌఖికంగా అందుతున్నటప్పటీకీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
రికార్డుల పరిశీలనతోనే సరి
జిల్లాలో భారీగా తనిఖీలు చేశామని చెబుతున్న అధికారులు కేవలం రికార్డులను నామమాత్రంగా పరిశీలించి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుకున్న స్థాయిలో తనిఖీలు జరగటంలేదని సమాచారం. ఆయా శాఖలోని కొంత మంది కీలక వ్యక్తులు, సిబ్బంది తాము తనిఖీలకు వెళ్లే బంకులకు ముందుగానే సమాచారం అందిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో లీగల్ మెట్రాలజీ అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే.
డీజిల్ వినియోగం
6.80 లక్షల లీటర్లు
7
న్యూస్‌రీల్
జిల్లాలో పెట్రోలు బంకులు : 189
జిల్లాలోని పలు పెట్రోలు
బంకుల్లో గోల్‌మాల్
రికార్డులు కూడా సరిగా
నిర్వహించని యాజమాన్యాలు
కొలతల్లోనూ తేడాలు
కనీసం గాలి మిషన్లు లేని
బంకులు ఎన్నో..
మంచినీరు, మరుగుదొడ్లు
వంటి కనీస వసతులు నిల్
నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు
తూతూ మంత్రంగా అధికారుల
తనిఖీలు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు