నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్):ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన తీరును నిరసిస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ వర్గీకరణ ద్వారా మాల, మాదిగలను విడదీస్తే సహించేది లేదని హెచ్చరించారు. వర్గీకరణ రాష్ట్ర యూనిట్‌గా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. లక్ష మందితో రాజధానిలో నిరసన సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మాల సంఘం జిల్లా అధ్యక్షులు దార హేమ ప్రసాద్, రాష్ట్ర మహిళా నాయకురాలు పిల్లి మేరి, ఏల్చూరి వేణు, బోరుగడ్డ రజనీకాంత్, పల్లె మురళి భీమ్ సేన సేవాదళ్ నల్లపు నీలాంబరం, ఉద్యోగ సంఘ నాయకులు కోడి రెక్క, కోటిరత్నం, రాచకొండ ముత్యాలరాజు, కార్యంశెట్టి సురేష్, తదితరులు పాల్గొన్నారు.