లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరులో క్రేన్ సంస్థలపై ఆదాయ పన్ను శాఖ మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. పొత్తూరు, సంపత్‌నగర్ ప్రాంతాలలో ఉన్న ఫ్యాక్టరీలలో అధికారులు సోదాలు చేశారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు మొత్తం 18 మంది ఓ బృందంగా దాడులు నిర్వహించారు. క్రేన్ అధినేత ఫ్యాక్టరీలు, బంధువుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు జరిగాయి. తనిఖీల సమయంలో అధికారులు క్రేన్ సంస్థల సిబ్బంది సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. మంగళవారం రాత్రి అంతా తనిఖీలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
18 మంది బృందంతో తనిఖీలు ఫ్యాక్టరీలు, బంధువుల ఇళ్లలో సోదాలు