గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Mar 14 2025 1:54 AM | Updated on Mar 14 2025 1:50 AM

శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025
దళిత రైతులపై

7

వైభవంగా బ్రహ్మోత్సవాలు

పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రులో కొలు వైన భూనీలా సమేత వరదరాజ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం రథోత్సవం జరగనుంది.

సాక్షి, ప్రత్యేక ప్రతినిఽధి: తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అమరావతి రాజధాని గ్రామాల్లో దమనకాండకు మళ్లీ తెరలేచింది. దళిత, పేద రైతులపై దౌర్జన్యాలు ఇదివరకటిలాగే పెచ్చురిల్లుతున్నాయి. పచ్చ గూండాలు, దళారులు, అధికారుల అండతో టీడీపీ నాయకులు బెదిరింపులకు తెగబడుతున్నారు. దళిత రైతులకు కేటాయించిన రిటర్న్‌బుల్‌ ప్లాట్లను తక్కువ ధరకు కొట్టేయాలని ఎక్కడికక్కడ కుట్రలు పన్నుతున్నారు. తమపై ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా దాడులకు పాల్పడుతున్నారనే తీవ్ర ఆరోపణలు పేద, దళిత రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఫలితంగా పలువురు బాధిత రైతులు లోలోన కుమిలిపోతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దళితులు దైన్యంలో కొట్టుమిట్టాడుతున్నారని రాజధాని గ్రామాల రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రద్దయిన జీపీలతో బెదిరింపుల పర్వం ...

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015లో కొందరు టీడీపీ నేతలు ఈ ప్రాంతంలో రాజధాని వస్తుందని, అసైన్డ్‌ భూములను సర్కారు లాగేసుకుంటుందని విస్తృత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. వచ్చినంత ధరకు ముందుగానే అమ్మేసుకోవాలని, లేదంటే పూర్తిగా నష్టపోతారని పేద రైతులను మభ్యపెట్టారు. బెదిరింపులతోనూ ఎంతో కొంత ముట్టజెప్పి ఏవో పత్రాలపై సంతకాలు సైతం చేయించుకున్నదీ విదితమే. అప్పటి పత్రాలను ఇప్పుడు తీసుకొచ్చి 2015లోనే జీపీలు చేయించుకున్నామని, భూములను ఎకరం రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు చెల్లించి కొనుగోలు చేసినట్లు చూపిస్తూ రిటర్న్‌బుల్‌ ప్లాట్లను తమకే ఇచ్చేయాలని బెదిరిస్తున్నారు. వాస్తవానికి టీడీపీ మూకలు చూపిస్తున్న జీపీలు ఎప్పుడో రద్దయ్యాయి. గత ప్రభుత్వం పేద దళిత రైతులకు అండగా నిలిచింది. పాత పత్రాలను ఇప్పుడు పట్టుకొచ్చి రైతులు తమ మాట వినాల్సిందేనని హుకుం జారీచేస్తున్నారు. కాదు కూడదన్న వారిని మందడంలోని డీఎస్పీ ఆఫీసుకు పిలిపించి సెటిల్‌మెంట్లకు కూర్చోపెడుతున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. పోలీసుల సాయంతో వేధింపులకు దిగుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఏబీ వియ్యంకుడిని అంటూ హల్‌చల్‌

గుమ్మడి సురేష్‌ అనే వ్యక్తి తనకు సీఎంఓలో పలుకుబడి ఉందని, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు స్వయానా వియ్యంకుడినని చెబుతూ రైతులను బెదిరిస్తున్నాడనేది ప్రధాన ఆరోపణ. రద్దయిన జీపీలు, అగ్రిమెంట్లను తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని, పోలీసుల సమక్షంలోనే సెటిల్‌మెంట్లకు రైతులను కూర్చోపెడుతున్నాడనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

రాజధాని గ్రామాల్లో టీడీపీ రౌడీ మూకల దౌర్జన్యం

రైతుల అవసరాలే ఆసరాగా..

ధైర్యంగా పోరాడదాం

రాజధాని గ్రామాల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది. టీడీపీ మూకల దౌర్జన్యాలపై రైతులందరం సమైక్యంగా పోరాడదాం. అధికార పార్టీ అన్యాయాలకు పోలీసులు, సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు వంతపాడుతున్నారు. ఇది సరికాదు. పేదల పక్షాన నిలబడాలి. నాపై టీడీపీ మాఫియా కక్ష కట్టింది. నన్ను అంతమొందించేందుకు యత్నిస్తోంది. అన్నిటికీ సిద్ధపడే పోరాటానికి పూనుకున్నా. బాధిత అసైన్డ్‌ రైతులతో కలిసి సమైక్యంగా పోరాడతాం. అప్పుడే మాఫియాను దీటుగా ఎదుర్కోగలం. ధైర్యంగా ముందడుగు వేయగలం.

– శృంగారపాటి సందీప్‌,

అసైన్డ్‌ రైతు, ఉద్దండరాయునిపాలెం

మందడంలో నూతక్కి నాగకిషోర్‌ అనే వ్యక్తి రైతుల అవసరాల కోసం రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షలు ఇచ్చి గతంలో ఖాళీ స్టాంప్‌ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నాడని, వాటిపై తన ఇష్టమైన రాతలు, రేట్లు రాసుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు వాటిని చూపి రైతులను బెదిరిస్తూ, డీఎస్పీ ఆఫీసులోనే సెటిల్‌మెంట్లుకు దిగుతున్నాడు. ఆలూరు సుబ్రమణ్యం, ఆలూరు బ్రహ్మం, బెజవాడ రమేష్‌ వంటి వారంతా గ్రూపుగా ఏర్పడి రిటర్న్‌బుల్‌ ప్లాట్లను కొల్లగొట్టే లక్ష్యంతో రైతులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దాదాపు మూడు వేల రిటర్నబుల్‌ ప్లాట్ల విషయంలో నానా రాద్ధాంతాలు జరుగుతున్నాయి. వీటి గురించి ఎవరికై నా చెప్పినా, ఫిర్యాదులు చేసినా రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రభుత్వ అధికారులు తమకు అండగా ఉంటారని తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేస్తున్నారనేది రాజధాని గ్రామాల్లోని పేద దళిత రైతుల మాట.

గుంటూరు1
1/6

గుంటూరు

గుంటూరు2
2/6

గుంటూరు

గుంటూరు3
3/6

గుంటూరు

గుంటూరు4
4/6

గుంటూరు

గుంటూరు5
5/6

గుంటూరు

గుంటూరు6
6/6

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement