చిట్టీల పేరుతో..
సంగడిగుంట కిడాంబినగర్ ఐదో వీధిలో ఉంటున్న తల్లి, కుమారుడు వస్త్ర దుకాణం నిర్వహించేవారు. రెండేళ్ల నుంచి చిట్టీ పాటలు నడుపుతున్నారు. గతేడాది తల్లి హఠాన్మరణం చెందారు. కుమారుడు చిట్టీ పాటల నగదు చెల్లిస్తానని నమ్మబలికాడు. ప్రస్తుతం ఆర్టీసీకాలనీలో ఉంటున్న అద్దె గృహాన్ని ఖాళీ చేశాడు. ఎవరైనా మొబైల్‌కు కాల్ చేసి డబ్బులు అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. దాదాపు రూ.25 లక్షలకుపైగా చెల్లించాల్సి ఉంది. న్యాయం చేయగలరు.
– బాణాల లక్ష్మి, శివపార్వతి,బాధితులు , సంగడిగుంట
నగరంపాలెం: ఉద్యోగాల పేరిట మోసగించారని పలువురు బాధితులు వాపోయారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు, పరిష్కారాల వ్యవస్థ ద్వారా అర్జీలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి బాధితుల నుంచి అర్జీలు తీసుకున్నారు. సకాలంలో బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఏఎస్పీలు (క్రైం) కె.సుప్రజ, హనుమంతు, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ కూడా అర్జీలు స్వీకరించారు.
●