మంగళగిరి/ మంగళగిరి టౌన్: మంగళాద్రిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి వారు యాలివాహనంపై దర్శనమిచ్చారు. ఇలా స్వామిని దర్శిస్తే దుర్మార్గుల వలన కలిగే భయం నశిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ ఈవో రామకోటి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మురికిపూడి పుష్పవేణి, కుమారులు వ్యవహరించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ముత్యాల పందిరి వాహనంపై....
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ముత్యాల పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి కై ంకర్యపరులుగా విజయవాడకు చెందిన అంగా ఉపేంద్రవర్మ, తేజస్విని దంపతులు వ్యవహరించారు.
నేడు సింహ వాహన సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నరసింహస్వామి సోమవారం ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి 7 గంటలకు సింహ వాహనంపై గ్రామోత్సవంలో విహరించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు తెలిపారు.
యాలివాహనంపై నరసింహుడు
యాలివాహనంపై నరసింహుడు