మంగళగిరి: వైకల్యాన్ని అధిగమించి మెడికల్ ఆఫీసర్‌గా రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇందిరానగర్ ఆరోగ్యం కేంద్రం అధికారిణి అనూష. ఆమె సొంతూరు గుంటూరు. ఏలూరు ఆశ్రంలో మెడికల్ సైన్సెస్ చదివారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై జరిపిన పరిశోధనల్లో 2,790 మందితో పోటీపడి జీనియస్ వరల్డ్ రికార్డు సాధించారు. 2022లో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. 2024లో బెస్ట్ మెడికల్ ఆఫీసర్‌గా కలెక్టర్ నుంచి అవార్డు అందుకున్నారు. రోగులకు మంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమె సేవల వల్ల పీహెచ్‌సీకి దేశంలోనే తొలి ఎన్కాస్ సర్టిఫికెట్, క్వాలిటీ ఎస్యూరెన్స్ అవార్డు లభించాయి.