తాడికొండ: తుళ్లూరు మండలం వడ్లమాను గ్రామంలో ఎన్నికల సమయంలో కారంశెట్టి వెంకట్రావు ఇంటిపైకి వెళ్ళి దాడి చేసిన ఐదుగురు టీడీపీ నాయకులపై తుళ్ళూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గోళ్ళ గోపీనాథ్‌రెడ్డి, చిలుకూరి జగదీష్ రెడ్డి, చల్లా మన్మథరెడ్డి, ఉయ్యూరు రాజశేఖరరెడ్డి, చల్లా వెంకట నరసింహారెడ్డి ఎన్నికల ముందు రోజు గ్రామ సెంటర్‌కు వచ్చిన కారంశెట్టి వెంకట్రావును టీడీపీకి ఓట్లు వేయాలని అడిగారు. అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో చిన్నపాటి వివాదం జరిగింది. ఆగ్రహించిన టీడీపీ నేతలు వెంకట్రావు ఇంటిపైకి వెళ్ళి కులం పేరుతో దూషించడంతోపాటు తల నరికి సైలెన్సర్‌కు వేలాడదీసుకొని వెళతామని బెదిరించారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీహెచ్ అనురాధ తెలిపారు.