
యడ్లపాడు: జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన యడ్లపాడు మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. నూజివీడు సమీపంలోని విసన్నపేట నుంచి పల్నాడు జిల్లా వినుకొండలో కొందరు ప్రయాణికుల్ని దింపి తిరిగి వస్తున్న క్రమంలో రాత్రి 8 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని బోయపాలెం 16వ నంబర్ జాతీయ రహదారి అండర్‌పాస్ వంతెన ఎక్కే సమయంలో కారు వెనుక భాగం నుంచి పొగలు, మంటలు రావడాన్ని డ్రైవర్ గమనించి వెంటనే వాహనాన్ని డివైడర్ పక్కన ఆపి కిందకు దిగాడు. వెంటనే ఒక్కసారిగా కారు మొత్తం మంటలు వ్యాపించాయి. నీటి కోసం చుట్టూ పక్కలాపరుగులు తీసినా దొరకలేదు. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. చిలకలూరిపేట అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. తీవ్రస్థాయిలో మంటలు చెలరేగడంతో అప్పటికే కారు పూర్తిస్థాయిలో కాలిపోయింది. కారును ఇటీవలే కొనుగోలు చేశారని, వైరింగ్ షార్ట్ అయి ప్రమాదం జరిగి ఉంటుందని అగ్రిమాపక శాఖ అధికారులు తెలిపారు.