
మాట్లాడుతున్న డాక్టర్ టీటీకె రెడ్డి
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల ఫోరెన్‌సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఆధివారం గుంటూరు వైద్య కళాశాలలో ‘లైంగిక నేరాలు– ప్రస్తుత పరిస్థితులు’ అనే అంశంపై పీజీ వైద్య విద్యార్థులకు నిరంతర వైద్య విద్య కార్యక్రమం(సీఎంఈ) నిర్వహించారు. ఫోరెన్‌సిక్ మెడిసిన్ వైద్య విభాగాధిపతి డాక్టర్ టీటీకే రెడ్డి మాట్లాడారు. లైంగిక దాడిలో జరిగిన నేరాన్ని శాసీ్త్రయంగా నిరూపించే విషయాలపై పీజీ వైద్యులు అప్రమత్తంగా ఉండి మెళుకువలు నేర్చుకోవాలని సూచించారు. ఒక పక్క బాధితులకు వైద్యసేవలు అందిస్తూనే, మరోపక్క మెడికో లీగల్ కేసుగా నమోదు చేసి నేరాన్ని ఏ విధంగా ఏఏ పరీక్షల ద్వారా నిరూపించాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పారు. చిన్నపిల్లలపై లైంగిక నేరాలు, పోక్సో యాక్ట్ గురించి వివరించారు. కార్యక్రమంలో గుంటూరు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శ్రీధర్, సీఎంఈ పరిశీలకులు డాక్టర్ సీతారామ, కో– ఆర్డినేటర్ డాక్టర్ బాబు, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, మార్కాపురం, మచిలీపట్నం, ఇబ్రహీంపట్నానికి చెందిన వైద్య కళాశాలల పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.