
జెండా ఆవిష్కరిస్తున్న యూనియన్ నేతలు
గుంటూరు మెడికల్: ఉద్యోగుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకుముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రాజారెడ్డి అన్నారు. మంగళవారం గుంటూరు జీజీహెచ్‌లోని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో యూనియన్ 12వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈవేడుకలకు రాజారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి యూనియన్ జెండా ఆవిష్కరించారు. యూనియన్ మెడికల్ జిల్లా అధ్యక్షుడు మద్దు ప్రేమజ్యోతిబాబు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకముందు ఉద్యోగులు 3,97,128 మంది ఉంటే, నాలుగేళ్లలో 6,16,000 మంది రెట్టింపు సంఖ్యలో ప్రభుత్వం ఉద్యోగులను నియమించిందన్నారు. రెట్టింపు సంఖ్యలో ఉద్యోగులను నియమించిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతోందన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఆవుల సుందరరామిరెడ్డి, రూబెన్, జీజీహెచ్ అధ్యక్షుడు యోహాను, సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, రాధరాణి, జ్యోతి, సంతోష్, మనోజ్, సునిల్, రాజారావు, సుబ్బారావు పాల్గొన్నారు.
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రాజారెడ్డి