
మాట్లాడుతున్న ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, పక్కన ఏఎస్పీ శ్రీనివాసరావు
నగరంపాలెం: జిల్లాలోని మహిళా పోలీసుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని జిల్లాఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ అన్నా రు. మంగళవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ) నుంచి జిల్లాలోని సబ్ డివిజన్ల డీఎస్పీలు, పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలతో జూమ్ ద్వారా ఎస్పీ మాట్లాడారు. మహిళా పోలీసుల విధులు, పెండింగ్ అరెస్ట్ వారెంట్స్, ఎన్‌డీపీఎస్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని మహిళా పోలీసులకు జాబ్‌చార్ట్ వివరించాలని చెప్పారు. కొందరి మహిళా సిబ్బందిలో ప్రతిభ, విల్లింగ్ ఆధారంగా టెక్నికల్ విభాగంలో విధులు నిర్వర్తించేలా పోలీస్‌స్టేషన్ల నుంచి ఎంపిక చేయాలని సూచించారు. ఎన్‌డీపీఎస్ కేసుల్లో వారితోపాటు, గంజాయి క్రయ–విక్రయాలు, సాగు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి తాగే వారిని కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు (పరిపాలన) కె.సుప్రజ, ఎ.శ్రీనివాసరావు (క్రైం), డీసీఆర్‌బీ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌బీ, డీసీఆర్‌బీ సీఐలు బి.నరసింహరావు, శ్రీనివాస్‌రావు, బాల సుబ్రమణ్యం, ఐటీ కోర్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ డి.వెంకటకష్ణ పాల్గొన్నారు.
గంజాయి క్రయ–విక్రయాలపై కఠిన చర్యలు