
అవార్డు అందుకుంటున్న మేదరమెట్ల విద్యార్థులు
మేదరమెట్ల: విజయవాడలో మంగళవారం నిర్వహించిన ఈఎండీపీ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి పోటీల్లో మేదరమెట్ల జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వీరిలో సాయి, చరణ్‌తేజ, సాయితేజ ఉన్నారు. పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థులకు ఏపీ ఈఎండీపీ ఎండీ నెజ్రిన్ మిద్లాజ్ విన్నింగ్ అవార్డు, అమెజాన్ గిఫ్ట్ ఓచర్లను అందజేశారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను హెచ్‌ఎం అంజయ్య, సైన్స్ ఉపాధ్యాయుడు పోతురాజు, ఉపాధ్యాయులు అభినందించారు.
ముగిసిన జాతీయస్థాయి
పశు బలప్రదర్శన పోటీలు
అచ్చంపేట: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వేల్పూరులో జరుగుతున్న జాతీయ స్థాయి పశు బలప్రదర్శన బండలాగుడు పోటీలు సోమ వారం రాత్రితో ముగిశాయి. వట్టికుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో కృష్ణా జిల్లా, కానూరు మండలం, పెనమలూరుకు చెందిన దేవభక్తుని సుబ్బారావు ఎడ్ల జత ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానాన్ని గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, కుంచనపల్లికి చెందిన పులగం జశ్వితారెడ్డి ఎడ్ల జతకు, మూడవ స్థానం గుంటూరు జిల్లా, చుండూరు మండలం, వేటపాలానికి చెందిన ఆర్కే బుల్స్, 4వ స్థానం పిడుగురాళ్ల మండలం, బ్రాహ్మణపల్లికి చెందిన దుప్పిలి అంజిరెడ్డి జతకు, 5వ బహుమతి బాపట్ల మండలం, బల్లికురవ గ్రామానికి చెందిన పావులూరి వీరాస్వామి చౌదరి జతకు, 6వ బహుమతి గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన అవుతు అర్హవర్థన్‌రెడ్డి జతకు, 7వ బహుమతి బాపట్ల మండలం బల్లికురవకు చెందిన పావులూరి వీరాస్వామి జతకు, 8వ బహుమతి పల్నాడు జిల్లా మాచవరానికి చెందిన ముక్కపాటి రామారావుచౌదరి జతకు, 9వ బహుమతి బాపట్ల మండలం బల్లికురవకు చెందిన పావులూరి వీరాస్వామి ఎడ్ల జతకు లభించాయి. పోటీలో మొత్తం 15 జతలు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.