
మాట్లాడుతున్న కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి
గుంటూరు వెస్ట్: పేదవారికి శాశ్వత గృహాలు నిర్మించాలనే గొప్ప ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభు త్వం సంకల్పించిన జగనన్న కాలనీల్లో నిర్మాణాలను నిరంతరం పరిశీలించాలని కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళ వారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ కాలనీల్లో ముందుగా క్రమపద్ధతిలో కనెక్టింగ్ రోడ్లు, మౌలిక సదుపా యాలు కల్పించాలన్నారు. డ్వాక్రా సంఘాలలో ఉన్న లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి నిర్మాణాల నిమిత్తం రూ.35 వేలు బ్యాంకుల ద్వారా అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ జరిగే అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించాలన్నారు. ఎక్కడైతే నిర్మాణాలు మందగిస్తాయో అక్క డి పరిస్థితులను తనకు వివరించాలని చెప్పారు. నిర్ణీత సమయాల్లో గృహప్రవేశా లు జరిపే విధంగా అధికారులు కృషి చేయా లని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, హౌసింగ్ పీడీ సాయినాథ్ కుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూధనరావు, జెడ్పీ సీఈఓ మోహనరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి