
రైతులకు వర్మికంపోస్ట్ ఎరువుల యూనిట్లను పంపిణీ చేస్తున్న శాస్త్రవేత్తలు
గుంటూరు రూరల్: వానపాముల ఎరువులు, కంపోస్ట్ ఎరువులతో భూమి ఆరోగ్యాన్ని కాపాడి ఆరోగ్యకరమైన పంటలను పండించవచ్చని తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.వెంకటనాయుడు తెలిపారు. మంగళవారం నగర శివారుల్లోని లాంఫాంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వర్మికం పోస్టు ఎరువుల యూనిట్, వానపాముల ఎరువుల తయారీ కేంద్రం లైసెన్స్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్మికంపోస్టు ఎరువులు, వాన పాముల తయారీ యూనిట్లను తక్కువ స్థలంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రెండు నెలల సమయంలో ఎరువులను తయారు చేసుకోవచ్చని దీని ద్వారా నెలకు రూ.20 వేలు సంపాదించవచ్చన్నారు. అనంతరం 30 మంది ఎంపికై న రైతులకు యూనిట్లను పంపిణీ చేశారు. లైసెన్స్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కె.వి.కె. ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె.వి.సుబ్రమణ్యం, అగ్రానమి శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి, డాక్టర్ కె.జె.రాజన్, కె శేఖర్‌రెడ్డి, ఎస్.మదన్‌మోహన్ పాల్గొన్నారు.
డాక్టర్ జి.వెంకట నాయుడు