
– సీఆర్డీయే కమిషనర్ వివేక్ యాదవ్
తాడికొండ: ఏపీ సీఆర్డీయే పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని వారి బాధ్యతలు నిర్వహిస్తున్న గుత్తేదారు సంస్థలకు ఏపీ రాజధాని ప్రాంత సీఆర్డీయే కమిషనర్ వివేక్ యాదవ్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఆర్డీయే పరిధిలోని మంగళగిరి, తాడికొండ, నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాలలో, ఏపీ సచివాలయం, ఉన్నత న్యాయస్థానాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. వారి భవిష్య నిధి వంటి సంక్షేమ కార్యక్రమాలలో ఎలాంటి జాప్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.