Job Opportunities: ‘చిప్స్‌’.. ఇప్పుడు హాట్‌టాపిక్‌! వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు!

Youth Pulse: New Trend Semiconductor Chip Job Opportunities In India - Sakshi

Semiconductor Career Opportunities in India: ‘శుభాకాంక్షలు’ తెలియజేసే ఛీర్‌... హిప్‌ హిప్‌ హుర్రే. ఇప్పుడు అదే ఛీర్‌తో భవిష్యత్‌కాల శుభ సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ‘చిప్‌ చిప్‌ హుర్రే’ అంటుంది యూత్‌. ఎందుకంటే...పరాధీనతకు చరమగీతం పాడడానికి, సెమికండక్టర్‌ చిప్‌ల తయారీవ్యవస్థను బలోపేతం చేస్తూ, స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి.

రాబోయే కాలంలో ఈ రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు యూత్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. సర్వం సాంకేతికమయం అయిన ఈ ప్రపంచంలో సెమికండక్టర్‌ చిప్‌లు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.

కరోనా కాటేసిన రంగాలలో ‘చిప్‌’ తయారీరంగం కూడా ఒకటి. కరోనాదెబ్బతో ‘చిప్‌’ల డిమాండ్, సరఫరాకు మధ్య భారీ అంతరం ఏర్పడింది. తయారీదార్లు రేట్లు పెంచారు. ఈ నేపథ్యంలో దేశాలు సెమీకండక్టర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టడం, బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. మన దేశం సెమీకండక్టర్‌ చిప్‌ల రూపకల్పన,తయారీ ప్రాజెక్ట్‌ కోసం 76వేల కోట్లు కేటాయించింది.

మరోవైపు విద్యాసంస్థలు తమ పాఠ్యప్రణాళికలో సెమికండక్టర్ల డిజైన్‌ను అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ‘దేశంలో చిప్‌ల కొరత...అనే వార్త చదువుతున్న క్రమంలో ఎందుకు? ఏమిటి? ఎలా? అనే కోణంలో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నన్ను ఆశ్చర్య,ఆనందాలకు గురి చేసిన విషయం ఈ రంగంలో భారీ ఉద్యోగావకాశాలు.

ఇంజనీరింగ్‌ చదువుతున్న చెల్లి సుహానితో నేను చదివిన విషయాలను షేర్‌ చేసుకున్నాను’ అంటోంది నాగ్‌పూర్‌(మహారాష్ట్ర)కు చెందిన కావేరి. చెల్లి సుహానికి ఇప్పుడు ‘చిప్స్‌’ అనేది హాట్‌టాపిక్‌. ఆ రంగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? అనేదాని గురించి చిన్నపాటి రిసెర్చ్‌ చేయడమే కాదు ఆ విషయాలను స్నేహితులకు చెబుతోంది.

పెద్ద పెద్ద సంస్థలు దేశంలోని వివిధప్రాంతాలలో సెమికండక్టర్ల తయారీ యూనిట్లను ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాయి. వివిధ రూపాల్లో ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహం కూడా బాగానే ఉంది. ఇదే సందర్భంలో మాన్యుఫాక్చరింగ్‌ టాలెంట్, ప్రాక్టికల్‌ స్కిల్స్‌పై చర్చ మొదలైంది. కళాశాల చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులను ‘జాబ్‌–రెడీ’కి సిద్ధం చేయడానికి ఆరు నుంచి పన్నెండు నెలల టైమ్‌ పడుతుంది అంటున్నారు సాంకేతిక నిపుణులు.

‘ఫ్యూచర్‌ ఏమిటి?’ అని రకరకాలుగా ఆలోచించిన సహజకు ‘చిప్‌’ల రూపంలో ఇప్పుడొక దారి దొరికింది. తిరునెల్వేలి(తమిళనాడు) చెందిన సహజ ‘సెమీకండక్టర్‌ ఇంజనీర్‌’ కావాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ‘సెమీకండక్టర్‌ల పరిశ్రమలో నైపుణ్యం కొరతను దృష్టిలో పెట్టుకొని చైనా ప్రభుత్వం చిప్‌ స్కూల్‌ను ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకంగా సైన్స్‌పార్క్‌ను ఏర్పాటుచేసింది.

చిప్‌ స్కూల్‌లో విద్యార్థులకు సెమీకండక్టర్లకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని అందించడంతో పాటు సీనియర్‌ ఇంజనీర్‌లు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లు, ప్రొఫెసర్‌లతో ఉపన్యాసాలు ఇప్పిస్తుంది. అలాంటి స్కూల్స్‌ మన దేశంలో కూడా ఏర్పాటుచేయాలి’ అంటుంది సహజ.  

మాసివ్‌ టాలెంట్‌ షార్టేజీ... అనే మాట ఒకవైపు నుంచి నిరాశగా వినిపిస్తున్నప్పటికీ, మరోవైపు నుంచి మాత్రం అత్యంత ఉత్సాహంగా ‘మేము రెడీ’ అని సన్నద్ధం అవుతోంది యువతరం. సాంకేతిక చదువు మాత్రమే చిప్‌ తయారీ పరిశ్రమలో రాణించడానికి ప్రధాన అర్హత కావడం లేదు. దీనికి క్రియేటివిటీ కూడా అత్యవసరం అంటున్నారు నిపుణులు. తమ డిజైనింగ్‌ ద్వారా టైమ్, డబ్బును ఆదా చేయడం యూత్‌ క్రియేటివిటీలో ఒకటి కాబోతుంది.
చదవండి: Indravathi Inspiring Story: ఆ‍త్మహత్య చేసుకోవాలనుకున్న ఇంద్రావతి.. పాపులర్‌ ఎలా అయింది

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top