Women Safety: ఈ ‘బ్రేస్‌లెట్‌’, ‘లాకెట్‌’ మీ దగ్గర ఉంటే.. ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు!

Women Safety: Top 4 Gadgets Will Help You Protect From Risky Situations - Sakshi

ధర్మం వైపు నిలిస్తే దర్భపోచ కూడా గర్జిస్తుంది...అనేది పెద్దల మాట.ఆపద చుట్టుముడితే ఈ చిట్టిపొట్టి ఆభరణాలు కూడా ఆయుధాలై గర్జిస్తాయనేది నేటి మాట...

రివోలర్‌: దీన్ని కీచైన్‌కు తగిలించుకోవచ్చు. దుస్తులకు స్టైలీష్‌గా పిన్‌ చేసుకోవచ్చు. ఇది వైఫైతో పనిచేస్తుంది. అత్యవసర సమయంలో సింగిల్‌క్లిక్‌తో మన కుటుంబసభ్యులకు ప్రమాద హెచ్చరిక వెళ్లిపోతుంది. ‘అవసరం నుంచే ఆవిష్కరణ’ అన్నట్లు ఆపద సమయం నుంచి పుట్టుకువచ్చిందే ఈ రివోలర్‌. ఈ కంపెనీ సీయివో జాక్వీలైన్‌ రోజ్‌ సోదరి రెండుసార్లు లైంగిక వేధింపుల ప్రమాదం నుంచి బయటపడింది.

ఆ చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని, చాలామంది సర్వైవర్లతో మాట్లాడి ఈ ‘రివోలర్‌’ను డిజైన్‌ చేసింది జాక్వీలైన్‌. న్యూ డీల్‌ డిజైన్‌ అనే డిజైనింగ్‌ స్టూడియో ఆకట్టుకునే రకరకాల సేఫ్టీ డివైజ్‌లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి డిజైన్‌లో పాలుపంచుకున్న జెనిఫర్‌ లాంగ్‌ ఒకప్పుడు లైంగిక వేధింపుల బాధితురాలే.

‘సొనాటా వాచ్‌ ఏసీటి’ అనేది టైమ్‌ చూపించడమే కాదు. మన టైమ్‌ బాగో లేనప్పుడు రక్షణగా నిలుస్తుంది. ఆపద సమయంలో వాచ్‌ని క్లిక్‌ చేస్తే కుటుంబసభ్యులకు మనం ప్రమాదంలో ఉన్నట్లు తెలియజేసే సమాచారం చేరిపోతుంది.

స్టిలెట్టో: ఈ వేరబుల్‌ టెక్‌ను బ్రేస్‌లెట్‌లాగా చేతికి ధరించవచ్చు. స్టైలీష్‌ లుక్‌తో నెక్లెస్‌లా మెడలో వేసుకోవచ్చు. ఆపద సమయంలో దీన్ని సింగిల్‌ప్రెస్‌ చేస్తే చాలు ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ లీస్ట్‌లోని వారికి సమాచారం చేరవేసి అలార్ట్‌ చేస్తుంది.

అథెనా: లాకెట్‌లా అందంగా కనిపించే ఈ నల్లని గ్యాడ్జెట్‌ను మెడలో వేసుకోవచ్చు. అవసరం అనుకుంటే పర్స్‌కు పిన్‌ చేయవచ్చు. దీని సహాయంతో మనం ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులకు మెరుపువేగంతో సమాచారం చేరవేయవచ్చు.

సేఫ్‌లెట్‌: ఈ సేఫ్‌లెట్‌కు రెండు బటన్‌లు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వీటిని నొక్కడం ద్వారా, సమాచారం మనవాళ్లకు చేరిపోతుంది. ఇది యూజర్‌ సెల్‌ఫోన్‌కు సింకై ఉంటుంది. ఆడియో రికార్డింగ్‌ చేస్తుంది. 

చదవండి: సైబర్‌ టాక్‌: కొనకుండానే లాటరీ వచ్చిందా?!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top