
వేసవి వచ్చిందంటే చాలు ఒక్కసారిగా అందరి ఇళ్లలో ఫ్యాన్‌ల కంటే ముందు ఏసీలు ఆన్ అయిపోతాయి. సూర్యుడి భగ భగలకు తాళ్లలేక చల్లటి ఏసిలో ఉండే కాస్త ప్రాణం లేచొచ్చిందరా బాబు అని అంటారు. అలాంటి ఏసీలను ఆన్ చేసినప్పుడూ నీళ్లు రావడం జరుగుతుంది. కంప్లసరీ ఆన్ చేసే వ్యవధిని బట్టి నీళ్లు ఎక్కువగా బయటకు రావడం జరుగుతుంది. అయితే ఈ నీటిని చాలా మంది పారబోసేస్తారు. వినయోగించరు. కానీ ఈ నీటిని హాయిగా ఉయపయోగించొచ్చట. మండు వేసవిలో ఉండే నీటి కొరతకు చెక్‌పెట్టేలా ఈ నీటిని ఆదా చేసుకోవచ్చని అంటున్నారు. ఇది ఏసీ నీరు కదా! సురక్షితమేనా? అంటే..
ఏసీ నుంచి వచ్చే వాటర్ కాబట్టి దీన్ని ఏసీ వాటర్ అంటున్నాం. కానీ, దీన్ని 'ఏసీ కండెన్సేట్ వాటర్' అంటారు. ఈ నీటిని మొక్కలకు నీరు పోయడానికి ఉపయోగించవచ్చు. ఎయిర్ కండీషనర్ నుంచి వచ్చే నీరు డిస్టిల్డ్ వాటర్ లాగా ఉంటుంది. స్వేదనజలం టీడీఎస్ (Total dissolved solids) సున్నాకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇది మొక్కలకు అనుకూలంగా ఉంటుంది. ఏసీ కండెన్సేట్ నీటి టీడీఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) విలువ 40 నుంచి 80 మధ్య మారుతూ ఉంటుంది. పర్యావరణంలో కాలుష్య స్థాయి, ఏసీ పరిస్థితితో ఈ విలువ పెరగవచ్చు. క్రమం తప్పకుండా సర్వీస్ చేయబడే క్లీన్ ఏసీ తక్కువ టీడీఎస్ విలువను కలిగి ఉంటుంది.
'అవుట్‌డోర్ ప్లాంట్స్' ఏసీ కండెన్సేట్ నీటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి సమస్య లేదు. ఈ నీరు మొక్కలకు ఊహించదగిన నీటి స్థాయిలను అందించడంలో సహాయపడుతుంది. చిన్న కుండలు, కంటైనర్లలో 'ఇండోర్ ప్లాంట్లు' నీరు తాగుటకు, కొన్నిసార్లు AC నీటిని ఉపయోగించడం లేదా సాధారణ పంపు నీటిలో కలపడం మంచిది.అయితే నీటిపారుదల కోసం ఉపయోగించే నీరు ఎసిటిక్‌గా ఉండటానికి తగినది కాదు. ఈ నీరు pHస్కేల్‌లో తటస్థంగా ఉండాలి.
పారిశ్రామిక ప్రాంతం లేదా డ్రెయిన్ దగ్గర ప్రాంతాల్లో ఏసీ నీరు కొద్దిగా ఎసిటిక్‌గా ఉండవచ్చు. అలాంటప్పుడూ ఈ ఎసిటిక్ నీటిని నీటిపారుదల కోసం ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది మొక్కలకు హాని కలిగించవచ్చు. వాటి స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. పారిశ్రామిక ప్రాంతంలో ఉండేవారు ఈ నీటిపారుదల ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే..? ఇది మొక్కలకు హాని కలిగించవచ్చు. వాటి స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేగాదు మొక్కలు ఎండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నీటిలో మినరల్స్, ఖనిజాలు లేకపోవడం వల్ల మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.
అలాగే ఈ ఏసీ నీటిని ఆదా చేయాలనుకుంటే..ఈ నీటితో వంటగది పాత్రలను కూడా కడగవచ్చు. ఏసీ కండెన్సేట్ నీటిలో బ్యాక్టీరియా, లోహాలు ఉంటాయి కాబట్టి ఈ నీటిని గిన్నెలు కడగడానికి, ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇలాంటి పనులకు ఉపయోగించడం మంచిదే కానీ కాని వంటగదిలోని పాత్రలను ఏసీ నీటితో శుభ్రం చేశాక మళ్లీ మంచినీళ్లు(శుభ్రమైన)తో మరొకసారి పాత్రలను కడగాల్సి ఉంటుంది. వేసవికాలంలో నీటి సమస్య ఉంటుంది కాబట్టి అందుకు ప్రత్యామ్నాయంగా ఈ నీటిని ఇలా ఉపయోగించొచ్చు.