కళ్లకు జోడు... స్టయిల్‌కు తోడు! | Stylish spectacles for mens | Sakshi
Sakshi News home page

కళ్లకు జోడు... స్టయిల్‌కు తోడు!

May 3 2026 12:18 AM | Updated on May 3 2026 12:18 AM

Stylish spectacles for mens

కళ్లద్దాలు అంటే కేవలం చూపు కోసం మాత్రమే అనుకుంటే, అది పెద్ద పొరపాటు! ఒక చిన్న యాక్సెసరీగా మీ పర్సనాలిటీని స్టయిల్‌గా చూపించే పవర్‌ ఈ కళ్లజోడుకే ఉంది. అందుకే, ఈ చిన్న సీక్రెట్స్‌ ఫాలో అయితే, మీ లుక్‌ ఆటోమేటిక్‌గా లెవల్‌ అప్‌ అవుతుంది!

ఫేస్‌ షేప్‌కు సరిపోయే ఫ్రేమ్‌
ప్రతి ఒక్కరి ముఖం ఒకేలా ఉండదు. అందుకే, ఫేస్‌ షేప్‌కు తగ్గ ఫ్రేమ్‌ ఎంచుకుంటేనే లుక్‌ సూపర్‌గా కనిపిస్తుంది. రౌండ్‌ ఫేస్‌ ఉన్నవారికి స్క్వేర్‌ లేదా రెక్టాంగిల్‌ ఫ్రేమ్స్‌ బాగా సెట్‌ అవుతాయి. ఓవల్‌ ఫేస్‌ ఉన్నవారు దాదాపు అన్ని స్టయిల్స్‌ ట్రై చేయొచ్చు. షార్ప్‌ జా లైన్  ఉన్నవారికి రౌండ్‌ ఫ్రేమ్స్‌ ఒక క్లాసీ టచ్‌ ఇస్తాయి.

కలర్‌ కూడా క్యారెక్టర్‌ చెప్పేస్తుంది
బ్లాక్, బ్రౌన్ , గ్రే లాంటి కలర్స్‌ ఎప్పటికీ క్లాసిక్‌. ఇవి ఏ డ్రెస్‌కైనా సెట్‌ అవుతాయి. అదే రెడ్, బ్లూ, గ్రీన్  లాంటి బ్రైట్‌ కలర్స్‌ అయితే మీరు కాస్త బోల్డ్, ఫన్  లవింగ్‌ పర్సన్  అన్న ఫీలింగ్‌ ఇస్తాయి. సన్ గ్లాసెస్‌లో డార్క్‌ షేడ్స్‌ కూల్‌ లుక్‌ ఇస్తే, లైట్‌ టింట్స్‌ ఒక ట్రెండీ వైబ్‌ ఇస్తాయి.

సందర్భానికి తగ్గట్టుగా
ఆఫీస్‌కి వెళ్తే సింపుల్, స్లిమ్‌ ఫ్రేమ్‌ స్పెక్ట్స్‌ ఒక ప్రొఫెషనల్‌ లుక్‌ ఇస్తాయి. బీచ్‌ ఔటింగ్‌ లేదా ట్రిప్‌కి వెళ్తే, పెద్ద ఫ్రేమ్‌ సన్‌గ్లాసెస్‌. పార్టీలు లేదా ఫొటో షూట్స్‌కి అయితే, ట్రెండీ షేప్‌ ఉన్న గ్లాసెస్‌ మీ లుక్‌ను హైలైట్‌ చేస్తాయి.

చిన్న ఫ్రేమ్‌తో పెద్ద ఇంపాక్ట్‌
కొన్నిసార్లు చిన్న సైజ్‌ ఫ్రేమ్స్‌ కూడా పెద్ద స్టేట్‌మెంట్‌ పీస్‌ అవుతాయి. ముఖానికి సరిగ్గా ఫిట్‌ అయ్యే ఫ్రేమ్‌ ఉంటే, అది మీ ఫీచర్స్‌ను మరింత హైలైట్‌ చేస్తుంది.

సన్ గ్లాసెస్‌ అంటే ప్రొటెక్షన్  మాత్రమే కాదు
సన్ గ్లాసెస్‌ మీ కళ్లను సూర్యకిరణాల నుంచి కాపాడడమే కాదు, మీ స్టయిల్‌ను కూడా షీల్డ్‌ చేస్తాయి. డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు, ట్రావెలింగ్‌లో లేదా ఔట్‌డోర్‌ యాక్టివిటీస్‌లో ఒక మంచి సన్ గ్లాసెస్‌ ఉంటే,  మీరు కంఫర్ట్‌గా, కూల్‌గా కనిపిస్తారు.

జాగ్రత్తలు!
స్పెక్ట్స్‌ లేదా సన్ గ్లాసెస్‌ ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.
చీప్‌గా కనిపించే ఫ్రేమ్‌లను తీసుకోవద్దు. మంచి క్వాలిటీ ఫ్రేమ్‌ అయితేనే లుక్‌ క్లాసీగా ఉంటుంది.
ఫేస్‌కు సరిపోని సైజ్‌ తీసుకుంటే, ఎంత ఖరీదైన గ్లాసెస్‌ అయినా అందంగా ఉండదు.

గ్లాసెస్‌ను తరచుగా క్లీన్‌ చేయండి. మసకగా ఉంటే లుక్‌ కూడా డల్‌గా కనిపిస్తుంది. 
గుర్తుంచుకోండి.. స్పెక్ట్స్‌ కళ్లకు మాత్రమే కాదు, మీ స్టయిల్‌కు కూడా ఫ్రేమ్‌ వేస్తాయి!

∙ దీపిక కొండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement