Fish Pakodi Recipe: నోటికి కాస్త కారంగా, క్రిస్పీగా.. ఇంట్లో ఇలా ఫిష్‌ పకోడి చేసుకోండి!

Recipes In Telugu: How To Make Fish Pakodi - Sakshi

ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వానల్లో.. నోటికి కాస్త కారంగా, క్రిస్పీగా తినాలనిపిస్తుంటుంది. ముసురుకి దుప్పటి ముసుగేయకుండా ఎంజాయ్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉండాలంటే... వేడివేడిగా కరకరలాడే స్నాక్స్‌ ఉండాల్సిందే. ఎక్కువ సమయం లేదా..? సులభంగా, త్వరగా ఇలా ఫిష్‌ పకోడి చేసుకోండి!

ఫిష్‌ పకోడి
కావలసినవి:
చేపముక్కలు – అరకేజీ
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు
నిమ్మరసం – టేబుల్‌ స్పూను
శనగపిండి – పావు కప్పు
కార్న్‌ ఫ్లోర్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు
కారం – రెండు టీస్పూన్లు
గరం మసాలా – టీస్పూను
వాము పొడి – అరటీస్పూను
గుడ్డు – ఒకటి
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. 
 
ఫిష్‌ పకోడి తయారీ విధానం
ముందుగా చేపముక్కలను శుభ్రంగా కడిగి గిన్నెలో వేయాలి.
దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
ముక్కలకు పట్టించిన తరువాత పదినిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి
మరో గిన్నెలో శనగపిండి, కార్న్‌ఫ్లోర్, కారం, గరం మసాలా, వాముపొడి, గుడ్డు సొన, అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి
పది నిమిషాల తరువాత చేపముక్కలను కలిపి మరో పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి
ఇప్పుడు చేప ముక్కలను తీసుకుని శనగపిండి మిశ్రమంలో ముంచి డీప్‌ఫ్రై చేసుకోవాలి
ముక్క రెండువైపులా బంగారు వర్ణం, క్రిస్పీగా మారేంత వరకు ఫ్రై చేసి సర్వ్‌ చేసుకోవాలి.  

ఇవి కూడా ట్రై చేయండి: Chilakada Dumpa Poorilu: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా!
Mutton Keema Cheese Samosa: మటన్‌ కీమా- చీజ్‌ సమోసా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోండి!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top