క్యాన్సర్ల బారినపడకుండా ఇలా చేయండి!

Prevent Cancer By Cooking Methods - Sakshi

మనం వంట వండే పద్ధతులతోనూ, వండే విధానంతోనూ క్యాన్సర్లను నివారించవచ్చు. నిజానికి మన జీవనశైలిలో మార్పులతో భాగంగా వండే పద్ధతుల్లోనూ మార్పుల వల్ల క్రమంగా క్యాన్సర్‌కు దారితీసే వంట ప్రక్రియలకు దగ్గరవుతున్నాం. ఉదాహరణకు మనం ఇటీవల మసాలాలు, వేపుళ్లు, బేకరీ ఐటమ్స్‌తో క్యాన్సర్‌లను ఆహ్వానిస్తున్నాం. మనం గుర్తుంచు కోవాల్సిన విషయం ఏమిటంటే... వంట విధానంలో... ప్రధానంగా వేపుళ్లు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, స్మోక్‌డ్‌ ఫుడ్, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు క్యాన్సర్‌కు దోహదం చేసే అంశాలని గుర్తించాలి.

దీనికి భిన్నంగా చప్పిడిగా ఉండే ఆహారం (బ్లాండ్‌ డైట్‌), ఉడికించే ప్రక్రియతో వండేవి (బాయిల్డ్‌ డైట్‌), మసాలలు, ఉప్పు తగ్గించిన ఆహారం (నాన్‌ స్పైసీ) సాధారణ ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు క్యాన్సర్లనుంచి దూరంగా ఉంచుతాయని గ్రహించాలి. అందుకే మనం ఏం తింటున్నామన్నదే కాకుండా... ఎలా (వండి) తింటున్నామన్న అంశం కూడా క్యాన్సర్‌ నివారణకు దోహదపడుతుందని తెలుసుకోవాలి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top