ఈ స్టయిల్‌లో మటన్‌ కీమా మెంతి ట్రై చేశారా? అస్సలు బోర్‌ కొట్టదు! | Best Non Veg Curry Recipes: Check This Tasty Mutton Keema And Menthi Cruury Recipe - Sakshi
Sakshi News home page

ఈ స్టయిల్‌లో మటన్‌ కీమా మెంతి ట్రై చేశారా? అస్సలు బోర్‌ కొట్టదు!

Published Thu, Mar 7 2024 3:51 PM

please check this tasty mutton Keema Menthi recipe - Sakshi

మటన్‌ కీమా మెంతి కూరతో కలిపి పోషకాలతోపాటు రుచిగా ఎలా  తయారు  చేయాలో తెలుసా?

వీకెండ్ వచ్చిందంటే నాన్‌ వెజ్‌ వెంట ఏం  చేయాలి అని ఆలోచిస్తున్నారు మాంసాహార ప్రియులు. ప్రతీ వారం ఒకే లాగా కూర చేసుకుంటే తినడానికి బోర్‌ కొడుతుంది.చిన్న పిల్లలు కూడా పెద్దగా  ఇష్టపడరు కదా. అందుకే మటన్‌ కీమా మెంతి కూరతో కలిపి పోషకాలతోపాటు రుచిగా ఎలా  తయారు  చేయాలో  చూసేద్దాం రండి:

కావాల్సిన పదార్థాలు
శుభ్రంగా  కడిగిన మటన్ కీమా – పావుకిలో
రెండు కట్టలు చింత మెంతి కూర(శుభ్రం చేసి కడిగినవి),
ఇంట్లో తయారు చేసుకున్న అల్లం  వెల్లుల్లి పేస్ట్‌
మటన్‌ మసాలా, బిర్యానీ ఆకులు 
కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి 
దాదాపు  గంటలో ఈ  వంటకాన్ని రడీ  చేసుకోవచ్చు.

తయారీ విధానం
కుక్కర్‌లో శుభ్రం చేసిన కీమాకు కొద్దిగా అల్లం వెల్లులి పేస్ట్‌, ఉప్పు కారం వేసి  బాగా కలిపి  మూతపెట్టి  నాలుగైదు  విజిల్స్ వచ్చే దాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

తరువాత మూకుడు పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకులు వేసి బాగా వేయించి పెట్టుకోవాలి. ఇపుడు ఆ మూకుడులోనే  కొద్దిగా నూనె వేడి చేసి హాఫ్‌ టీ స్పూన్‌  జీలకర్ర వేయాలి. అవి చిటపట లాడుతుండగా వెల్లుల్లి, అల్లం పేస్ట్‌, ధనియాల పొడి , ఉల్లిపాయలు, బే ఆకులు , గరం మసాలా వేసి, వేయించినూనె తేలెదాకా వేయించాలి. ఇపుడు ఉడికించి పెట్టుకున్న కీమావేసి నీళ్లు ఇగిరే దాకా సన్న సెగమీద ఉడకనివ్వాలి. ఇక చివరగా ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతికూర, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా ఉడక నివ్వాలి.  మంచి సువాసనతో  కుతకుత లాడుతూ ఉడుకుతుంది.

ఇందులో  ఇష్టమున్న వాళ్లు రెండు చిన్న టమాటాలను కూడా యాడ్‌ చేసుకోవచ్చు.   మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతే ఎంతో రుచి మటన్ కీమా మెంతికూర రడీ. దీన్ని చక్కని సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకొని కొత్తిమీర, పుదీన,ఉల్లిపాయ, నిమ్మ స్లైస్‌లతో అందంగా గార్నిష్‌ చేయండి. రైస్‌తోగానీ, చపాతీలో గానీ చక్కగా ఆరగించే యొచ్చు. అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మటన్ కీమాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

Advertisement
Advertisement