‘మన నగరంలో చిరుతపులులు సంచరిస్తున్నాయనే విషయం మీకు తెలుసా?’ ‘మీరు బయట ఎక్కడైనా ఉన్నారా? ఎందుకైనా మంచిది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీ వెనక చిరుత ఆకలితో ఉండవచ్చు’... ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. వీధుల్లో చిరుత సంచరిస్తున వీడియోలు కూడా అందులో ఉన్నాయి.
దీనితో లక్నో నగరంలో చాలామంది నిజమే అనుకొని భయపడ్డారు. ఒక వ్యక్తి అయితే దూరంగా కనిపించిన శునకాన్ని చిరుత అనుకొని భయపడి పరుగులు తీశాడు. కొందరు తమ ఇంటి సీసీటివి రికార్డింగ్‌ను రోజూ చూడడం ప్రారంభించారు. ఇంటిచుట్టు పక్కల ఎక్కడైనా చిరుత కనిపిస్తుందేమో అనేది వారి సందేహం.
A guy from Lucknow used AI to add a leopard to his photo and posted it online, saying, “Spotted near my house.”
It went super viral, people got scared, and even the forest team came running—only to find out it was fake.
Now he’s in jail for the prank! 😅 pic.twitter.com/LnP7I9hyfH— Ghar Ke Kalesh (@gharkekalesh) October 28, 2025
‘అసలు ఏంజరుగుతుంది?’ అని తెలుసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగింది. అందరినీ భయపెడుతున్న ఆ వీడియోలు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా రూపొందించారని తెలుసుకున్నారు! ఈ నకిలీ వీడియోలకు సంబంధించి ఒక యువకుడిని అరెస్ట్ చేశారు.
(చదవండి: ఏఐలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్)


