క్యూట్‌లుక్‌తో కట్టిపడేసే కృతి సనన్‌ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..

Kriti Sanon Stuns In A Pretty Pink Saree With A Floral Blouse - Sakshi

కృతి సనన్‌.. కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురయ్యాయి. అయినా ఎక్కడా కాన్ఫిడెన్స్‌ కోల్పోలేదు. ఒకవైపు మోడలింగ్‌ చేస్తూనే సినిమా చాన్స్‌ల కోసం ట్రై చేశాను, సాధించాను. అందుకే ముందు మనల్ని మనం నమ్మాలి అని చెబుతోంది. ఆమె గ్లామర్‌కే కాదు అభినయానికీ అంతే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకు కనిపించే ఉదాహరణ.. ‘మిమీ’ మూవీ. ఆ తపన, అభిరుచి ఆమె ఫ్యాషన్‌ స్టయిల్‌లోనూ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్‌ ఈ బ్రాండ్సే..

మసాబా గుప్తా...
మసాబా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్‌ లెజెండ్‌ వివియన్‌ రిచర్డ్స్‌ల కూతురు అని తెలుసు కదా! కానీ పేరెంట్స్‌ పేరుప్రఖ్యాతులను తన కెరీర్‌కి పునాదిగా మలచుకోలేదు. కేవలం తన క్రియేటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జిస్తోంది. ఇప్పుడున్న టాప్‌ మోస్ట్‌ డిజైనర్స్‌లలో మసాబా గుప్తానే ఫస్ట్‌. 2009లో ‘హౌస్‌ ఆఫ్‌ మసాబా’ పేరుతో బ్రాండ్‌ను ప్రారంభించింది. సృజన, నాణ్యతే బ్రాండ్‌ వాల్యూగా సాగిపోతోంది. అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. ఎందరో సెలబ్రిటీలు ఆమె డిజైన్స్‌కు వీరాభిమానులు. ధర కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఇక్కడ కృతి సనన్‌ ధరించి మసాబా గుప్తా కాస్ట్యూమ్‌ ధర రూ. 18,000/-

కళ్యాణ్‌ జ్యూయెలర్స్‌...
బంగారు, ముత్యాలు, వజ్రాల వ్యాపారంలో వందేళ్లకు పైగా చరిత్ర గల సంస్థ కళ్యాణ్‌ జ్యూయెలర్స్‌. దేశంలోనే కాదు గల్ఫ్, యూరోప్, అమెరికా దేశాల్లోనూ శాఖలను తెరిచింది. స్వచ్ఛత, నాణ్యత, నాజూకైన డిజైన్లే దీని బ్రాండ్‌ వాల్యూ. ధర ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. 

కళ్యాణ్‌ జ్యూయెలర్స్‌ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.   

దీపిక కొండి

(చదవండి: విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్‌ ధర వింటే షాకవ్వుతారు!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top