నోరూరించే మసాలాలు, పుల్లని చల్లటి నీరు.. సాయంత్రం వేళ పానీ పూరీ ఇచ్చే మజాయే వేరు. అందుకే పానీ పూరీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. తాజాగా ఓ జపనీస్ పారిశ్రామికవేత్తకు కూడా మన పానీ పూరీ తెగ నచ్చేసిందంట. హెర్మెస్ అనే జపనీస్ మహిళ ఎక్స్ వేదికగా పానీ పూరీపై తనకున్న మక్కువను పంచుకోవడంతో.. సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.
వారంలో రెండు రోజులు పానీ పూరీ తింటున్నాననీ.. బయట ఫుడ్‌ని ఇష్టపడని తన భర్త కూడా నీ పూరీ రుచికి ఫిదా అయిపోయారని ఆమె అందులో రాసుకొచ్చారు. అందుకే తను జపాన్‌లో ఏకంగా ఓ పానీ పూరీ సెంటర్‌ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఇంట్లోకి ఒక పానీ పూరీ కిట్‌ను కూడా తెచ్చుకున్నట్లు హెర్మెస్ వెల్లడించారు.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు భారతీయుల ఫేవరెట్ స్నాక్‌కు జపాన్‌లో కూడా క్రేజ్ రావడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మా పానీ పూరీ పవర్ అలాంటిది’ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
パニプリにハマりすぎて、気軽に食べ歩きできるパニプリ屋でも起業しようかなって真剣に思うくらいハマってる。エキゾチック料理NGな夫すら、「俺ハマったかもしれん、パニプリのことをすぐ考えてしまう」と言うくらい中毒性ある、、週2くらいで食べてるし、パニプリキットも買った笑 pic.twitter.com/LXqtiklwS6
— エルメス (@hermes_ooo) April 20, 2026
(చదవండి: Met Gala 2026: గోల్డ్ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్‌లో మొత్తం అమ్మ..)


